డబ్బింగ్ సినిమా అంటే చిన్న చూపు ఎప్పుడో పోయింది. ఎప్పుడు ఏ సినిమా హిట్టు కొట్టి, కాసుల వర్షం కురిపిస్తుందో ఎవ్వరం చెప్పలేం. అందుకే విక్రమ్, సూర్య, కార్తి సినిమాలొస్తున్నాయంటే ఎలర్ట్ అయిపోతారు మన నిర్మాతలు. రూపాయి పెట్టాల్సిన చోట.. రెండు రూపాయలు పెట్టడానికి కూడా వెనకాడరు. అదే రజనీకాంత్ సినిమా అంటే చెప్పక్కర్లెద్దు. ఆ సినిమా రైట్స్ సంపాదిస్తే, రజనీకాంత్‌తో నేరుగా సినిమా తీసినంత సంబరపడిపోతారంతా. అందుకే కబాలీకీ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తెలుగు రైట్స్కోసం కొంతమంది నిర్మాతలు, పంపిణీదారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సురేష్ బాబు, బండ్ల గణేష్ కూడా లైన్లో ఉన్నారు. ఆఖరికి అభిషేక్ పిక్చర్స్ దగ్గర బేరం ఆగింది.
తమిళ నిర్మాత కబాలీ తెలుగు రైట్స్‌తో రూ.35 కోట్లు లాగేద్దామని పెద్ద స్కెచ్ వేశాడు. సురేష్‌బాబు, గణేష్‌లు రూ.25 (శాటిలైట్‌తో కలిపి) కోట్ల వరకూ వెళ్లారు. అభిషేక్ వాళ్లు రూ.30 కోట్లకు బేరం పెట్టారు. అయితే రూ.35 కోట్లు ఇస్తేగానీ రైట్స్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. చివరికి బేరం రూ.32 కోట్లు ఇస్తానన్నా… ఇవ్వమంటున్నార్ట. ఎంతకీ బేరసారాలు తెగడం లేదు. లింగ సినిమా ఫ్లాప్ అయినా.. రజనీ సినిమా ఇంత చేస్తుందంటే ఆశ్చర్యపోతున్నాయి మార్కెట్ వర్గాలు. రజనీ సినిమా స్టామినా అంతే మరి.