తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 1000 సినిమా ధియేటర్ల నిర్మాణానికి ‘స్వదేశీ గ్రప్’ ఒక ప్రాజెక్టుని రూపొందించింది. దేశంలోనే సినిమా నిర్మాణంలో రెండో ప్లేసులో వున్న తెలుగు సినిమాలకు పండుగ సమయాల్లో ధియేటర్లు లేక రిలీజుల్ని వాయిదా వేసుకోవడమో రీ షెడ్యూలు చేసుకవడమో జరుగుతోంది.
ఈ డిమాండుని మీటవ్వడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని షాపింగ్ మాల్స్ లో మాల్ కి రెండు ధియేటర్లు కట్టడానికి 10 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ”స్వదేశీ” ప్రాజెక్టుల డైరక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ చెప్పారు. పూనా ఫిలిం ఇన్ స్టిట్యూట్ తరహాలో సినిమా నిర్మాణం లో ప్రతీ రంగంలోనూ ట్రయినింగ్ ఇచ్చే సంస్ధను కూడా స్వదేశీ గ్రూప్ ప్రారంభించబోతోంది. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ, ఇప్పటికే కోర్సులు డిజైన్ చేయడం మొదలు పెట్టారని చెప్పారు.