అల్లు అర్జున్ సరైనోడు తరవాత ఎలాంటి సినిమా చేయాలా.. అని తెగ ఆలోచించాడు. రకరకాల కాంబినేషన్లు ట్రై చేశాడు. విక్రమ్ కె.కుమార్‌తో ఓ సినిమా చేయాలని గట్టిగా ట్రై చేశాడు. కానీ సెట్ అవ్వలేదు. త్రివిక్రమ్‌తో మళ్లీ జోడీ కట్టాలని ఆశించాడట. వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలొచ్చాయి. మరోసారి త్రివిక్రమ్‌తో సినిమా చేసి హ్యాట్రిక్ కాంబినేషన్ అనిపించుకొందామనుకొన్నాడు బన్నీ. ఈ విషయమై త్రివిక్రమ్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం.
బన్నీతో టై అప్ అవ్వడానికి త్రివిక్రమ్ కూడా సముఖత వ్యక్తం చేసినా.. బన్నీకి తగిన కథ త్రివిక్రమ్ దగ్గర అర్జెంటుగా లేకపోవడంతో.. త్రివిక్రమ్ సున్నితంగా తప్పుకొన్నాడట. ‘కావాలంటే వచ్చే యేడాది చేద్దాం’ అన్నాడట. దాంతో బన్నీ ఆశలు ఆడియాసలయ్యాయి. ఈ ఆప్షన్లన్నీ చూసుకొన్నాకే… లింగుస్వామికి ఓటేశాడట బన్నీ. ఇప్పుడు బన్నీ – లింగుస్వామి కలసి కథని సానబెట్టే పనిలో ఉన్నారు. ఈసారి కుదరకపోయినా త్రివిక్రమ్‌తో బన్నీ మరో సినిమా చేయడం ఖాయమైపోయింది. కానీ అదెప్పుడన్నదే చూడాలి.