మోహన్ బాబు.. ముక్కుసూటితనానికి మారు పేరు. క్రమశిక్షణకు అసలు పేరు. మోహన్ బాబు మాటంటే మాటే! ఎవ్వరినీ లెక్కచేయని తనం ఆయన సొంతం. పైగా కోపం ఎక్కువ. అది కంట్రోల్తప్పితే ఆయన ఏం చేస్తారో, ఆయనకే తెలీదు. సెట్లొనే అందరి ముందూ విశ్వరూపం చూపిస్తారు. అసెంబ్లీ రౌడీ షూటింగ్ లోనూ ఇదే సంఘటన జరిగిందట. అసెంబ్లీ రౌడీ షూటింగ్ తిరుపతి సమీపంలో జరిగింది. అక్కడ క్లైమాక్స్ ముందు సీన్లు తీస్తున్నారు. మోహన్ బాబు డైలాగులన్నీ… టక టక చెప్పేస్తున్నారు. ఈలోగా గుంపులోంచి ఓ వ్యక్తి… లొకేషన్లోకి వచ్చేశాడు. సీన్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఏం చేయాలో అర్థం కాక… డైరెక్టర్ బి.గోపాల్ కట్ చెప్పాడు.
నీ డైలాగులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయ్ – అంటూ ఆ వ్యక్తి గొడవ పడ్డాడు. నేను ఏ పార్టీకీ వ్యతిరేకం, రైటర్ రాసిన డైలాగులు ఇక్కడ చెబుతున్నానంతే.. అన్నారట మోహన్ బాబు. కానీ ఆ వ్యక్తి వినిపించుకొనే స్థితిలో లేడట. సెట్లోనే తన జులూం చూపించడానికి రెడీ అయ్యాడట. దాంతో మోహన్ బాబుకి చిర్రెత్తుకొచ్చింది. చేతిలో ఓ ఆయుధం తీసుకొని.. ఆ వ్యక్తిని తిరిమి తరిమి కొట్టాడట. నేను పోలీస్ పర్మిషన్లన్నీ తీసుకొని… చట్టబద్దంగా, న్యాయబద్దంగా నా పని నేను చేసుకొంటే, ఆపడానికి నువ్వెవడివి… అంటూ అటూ ఇటూ వాయించేశాడట. ఈ విషయాన్ని మోహన్ బాబు గుర్తుచేసుకొన్నారు. అసెంబ్లీ రౌడీ విడుదలై.. పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు కలెక్షన్ కింగ్. అదీ మేటరు.