కాజల్.. ఆ పేరుకు తగ్గట్టు కాటుక రాసే అవసరమే రాని కళ్లు. ఎప్పుడూ మిల మిల మెరుస్తూ, కవ్విస్తూ ఉంటాయి. ఆ కళ్లని చూసే పడిపోతారంతా. అలాంటి కళ్లని కాజల్ ఇప్పుడు దానం చేసేసింది. తన తదనంతరం కళ్లు లేని జీవితాల్లో వెలుగు ప్రసరించాలన్న మంచి ఉద్దేశంతో కాజల్ ఈ నిర్ణయం తీసుకొంది. కాజల్ నటించిన తాజా చిత్రం.. దో లవ్జోంకే కహానీ. రణదీప్ హుడా కథానాయకుడు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో కాజల్ పాత్రకు కళ్లుండవు. ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఈ లోకాన్ని చూడలేని గుడ్డవాళ్లపై మరింత ప్రేమ, జాలి కలిగాయట. అందుకే కాజల్ ఈ నిర్ణయం తీసుకొందట.
కాజల్ నిర్ణయంతో కథానాయకుడు రణదీప్ హుడా కూడా స్పూర్తి పొందాడేమో.. తాను కళ్లను ఓ స్వచ్ఛంద సంస్థకు రాసిచ్చేశాడు. మొత్తానికి కాజల్, రణదీప్ హుడా తీసుకొన్న నిర్ణయం చాలామందిలో స్ఫూర్తిని నింపుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ దో లవ్వోంకే కహానీ అంటే… కాజల్ హాట్ లిప్ కిస్ గురించే మాట్లాడుకొనేవాళ్లు. ఇప్పుడు కాజల్ చేసిన మంచి పని గురించి కూడా మాట్లాడుకొంటారు. శభాష్ కాజల్.