మార్కిస్కులు చానెల్ పెట్టారు కాబట్టి కమ్యూనిస్టులు (సీపీఐ) రంగంలోకి దిగారు. చానెల్ తో మార్కిస్టులు బావుకొని తిన్నదేమో గానీ… కమ్యూనిస్టులు మాత్రం ఏపీ, తెలంగాణలో మాంచి పేరు సంపాదించేశారు. సేమ్ టు సేమ్ మార్కిస్టుల తరహాలో భారీగా జనం దగ్గర్నుంచి చందాలు వసూలు చేసి, అదే తరహాలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెట్టేశారు. సొంత కాంపౌండ్ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వద్ద చానెల్ ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్టూడియోలను భారీగా నిర్మించారు. చానెల్ సొంత భవనంలో ఉంటే అద్దె కలిసొస్తుందని ఊహించారు. చానెల్ బాధ్యతలను సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తనయుడు కపిల్ కు అప్పజెప్పారు. ఇక మనోడు చానెల్ ఏర్పాటంటూ తెగ దున్నేశాడని అక్కడి మిత్రులు చెబుతారు. అయితే సురవరం ఫ్యామిలీ అలాంటి పనులు చేస్తుందంటే నమ్మడం కష్టమే.
ఎక్యూప్మెంట్ కొనుగోలు దగ్గర్నుంచి ఉద్యోగులకు జీతాలిచ్చే వరకు అంతా ప్రహసనమే. అన్నీ చానెళ్లు తిరిగిన అనుభవంతో కపిల్ చానెల్ దున్నేస్తాడనుకుంటే… వారి నమ్మకాన్ని కపిల్ ఆరు నెలల్లోనే వమ్ముచేశాడు. చానెల్ కోసం దాదాపు నారాయణ అండ్ కో 40 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని చెబుతారు. ఎమౌంట్ ఎగ్జాట్ గా తెలియదనుకోండి.
చానెల్ పెట్టిన ఆర్నెల నుంచే జీతాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఎందుకలా జరిగిందంటే బదులు చెప్పేవారే లేరు. రేటింగ్ లో ఎప్పుడూ లేదు… సో వారికి మార్కెటింగ్ గురించి యాడ్సు గురించి పెద్దగా వర్రీ కూడా లేదు. అయితే ఇక్కడ జరిగిందేంటంటే, చానెల్ బ్రాండ్ మార్కెట్లోకి వెళ్లలేకపోయింది. టీవీ9 చానెల్ ఉంది కాబట్టి 99 అని పెట్టినట్టు అనుకోవాలి. వారు సక్సెస్ అయ్యారు కాబట్టి మేం కూడా సక్సెస్ అవుదామని వీరు భావించి ఉండాలి. అయితే వారి ఆశలన్నీ అడియాశలే అయ్యాయి… చానెల్ కు ఒక బ్రాండ్ లేదు… ఒక అంబాసిడరూ లేడు. గాల్లో దీపం పెట్టి ఎన్నాళ్లు చేతులు పెట్టి ఆపుతారు. అదే ఇక్కడ 99టీవీ విషయంలోనూ జరిగింది.
చానెల్ కు సినిమా పరంగా ఒక షేప్ తీసుకొస్తాడని భావించి… తమ్మారెడ్డి భరద్వాజను 99టీవీకి సీఈవోను చేశారట. ఆయన కూడా దాదాపు ఏడాదిపాటు చానెల్ వ్యవహారాలు చూసుకున్నాడు. అయితే చానెల్ లో మాత్రం మార్పు రాలేదు. మీడియా ముందు, సినీ ఫంక్షన్లు ముందు విమర్శనాత్మకంగా మాట్లాడటంలో దిట్ట అయిన తమ్మారెడ్డి వారు చానెల్ విషయంలో మాత్రం చేతులెత్తేశారు. అంతేగా మరీ తమ్మారెడ్డి క్లిక్కయితే పరిస్థితి ఇలా ఎందుకు మారుతుంది? ఆదాయం లేదు, ఖర్చు మాత్రం అలాగే ఉంది. ఉద్యోగులకు మాత్రం జీతాలు లేవు. కార్మికుల పక్షాన మాట్లాడే నారాయణ… చానెల్లో పనిచేసిన ఉద్యోగులకు పూర్తి జీతాలివ్వకుంటే ఊరుకోమని ఆ సంస్థలో పనిచేసే కాటంరాయుళ్లు కుండబద్ధలుకొడుతున్నారు. అయితే పార్టీలో పనిచేసేవారిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్సెప్రెస్ లో లాంటి పరిస్థితులు ఇక్కడ ఇంకా రాలేదు. మనవాళ్లదే కదా చానెల్, ఇప్పటికైనా మన డబ్బులు మనకు రాకపోతాయా అని ఆశతో సిబ్బంది ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటున్నారు.
ఇక చానెల్ ను తీసుకోండండూ నారాయణ ఏడాది నుంచి ఎక్కినగడప దిగకుండా ఎక్కుతున్నాడు. టీడీపీ ముఖ్యనాయకుడ్ని ఏపీలోకి చానెల్ నిర్వహించుకోవాలంటూ ఆయన సలహాకూడా ఇచ్చాడట. అయితే ఆ చానెల్ చూసిన మహామనుషులు వద్దు ప్రభో అంటూ సదరు నేతను వేడుకోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సీన్ కట్ చేస్తే ఇక్కడే కంపెనీలోకి గరుడ అంటూ కొందరు వ్యాపారులు ప్రవేశించారు. చానెల్ మేం నిర్వహిస్తామంటూ వారు నారాయణకున్న ధర్మసందేహాలను తీర్చారు. సరే కానీ… జీతాలివ్వలేకపోతున్నాం. ప్రస్తుతం చానెల్ నడిపితే చాలని 99 యాజమాన్యం భావించింది. అయితే మధ్యలో గుంటూరు నాయుడుగారిని తీసుకొచ్చారు అక్కడే పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు. అయితే ఆ స్టోరీ కేవలం వారం రోజులకే ఫినిషయ్యింది. బాకీలు, అక్కడ సీన్ చూసిన తర్వాత నాయుడుగారు సాధ్యమైతే కొత్త ప్రాజెక్టు చేస్తాగానీ… ఇక్కడ మాత్రం ఉండనంటూ బయటకొచ్చేశాడంట.
కట్ చేస్తే మళ్లీ గరుడ మనుషులు మళ్లీ రంగంలోకి దిగారు. గతంలో డైరీ ఫామ్ పేరుతో బ్యాంకుల నుంచి లోన్ల తీసుకున్న ఈ బ్యాచ్ చానెల్‌ను విజయవంతం చేద్దామంటూ మళ్లీ లైన్లోకి వచ్చింది. చానెల్ మీదేనంటూ జనం వద్ద వీరు కూడా కొంత మేర వసూలు చేశారని కూడా అక్కడి సిబ్బంది చెబుతారు. అల్రెడీ ఒకసారి చూశారు కాబట్టి ఈసారి సక్సెస్ అవుతారేమోనని… భావించిన నారాయణ మళ్లీ వారికే అప్పజెప్పాడు.
ఇక్కడ విషయమేమంటే ఈ చానెళ్లో డైరెక్టర్లుగా పార్టీ నేతలతోపాటు, పలువురు వ్యాపారులు ఉన్నారు. నారాయణ సతీమణి కీలక డైరెక్టర్ అని కూడా చెబుతారు. పార్టీయే అంతంత మాత్రంగా ఉంది… మళ్లీ చానెల్ పెట్టి కాల్చుకోవడమెందుకా అని… నారాయణ చుట్టూ ఉన్న నేతలు చానెల్ ఏర్పాటుకు ముందు చాలాసార్లూ చెప్పారట. మార్కిస్టులకు చానెల్ ఉండి మనకు లేకపోతే ఎలా అని మనం కూడా తేవాల్సిందేనని నారాయణ గట్టిపట్టుదలతో చానెల్ తెచ్చాడట. ఇంత వరకు బాగానే ఉంది. అప్పటికే అనేక దోషాలతో సతమతమవుతున్న చానెల్స్ ను చూసైనా నారాయణ మంచి ప్రణాళికతో వచ్చి ఉంటే బాగుండేది. ప్రజల నుంచి షేర్ హోల్డర్స్ రూపంలో 12 కోట్లు, బ్యాంకు లోను 12 కోట్లు, పార్టీ ఫండ్ 8 కోట్లతోపాటు, చందాలు, నేతల నుంచి మరో ఏడెనిమిది కోట్ల వరకు పేగోశారు. అయితే ఇప్పుడు ఎక్యూప్మెంట్ కూడా అవుడేట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంకు లోను 11 కోట్లుతోపాటు, ఇతర అప్పులు నాలుగైదు వరకు ఉన్నాయట. మార్కెట్లో అప్పటికే ఫెయిలైన ఒక బ్రాండ్ చానెల్ సూచనలతో ఇదంతా జరిగిందన్న అభిప్రాయం 99టీవీలో పనిచేసే సీనియర్ల భావన. ఇప్పుడున్న పరిస్థితుల్లో నారాయణకు (సీపీఐ పార్టీకి) పార్టీ ఫండ్ కావాలంటే ఇవ్వడమే కష్టమవుతున్న పరిస్థితి… ఇక చానెల్ కు ఫండ్ ఎవరిస్తారబ్బా… ఫైనల్ గా ఒకటి చెప్తా… చానెల్ ముంచినా, తేల్చినా అది నారాయణ ఘనతే అవుతుంది.