భారీగా సినిమాలు తీయడం, ఎంత డబ్బయినా పెట్టి సినిమాలు కొనడంలో దిల్ రాజుకు ఎంతో పేరుంది. భారీగా డబ్బులు పెట్టి చెయ్యి కాల్చుకున్న అనుభవం కూడా ఉంది. అయినా ధైర్యంగా పెట్టుబడి పెడతాడని అందుకే దిల్ రాజు అనీ అంటారు. అయితే టాలీవుడ్ లో ఈమధ్య రెండు డిజాస్టర్ ఫ్లాప్ ల నష్టం నుంచి దిల్ రాజు చాలా తెలివిగా తప్పించుకున్నాడని టాక్.
లేటెస్ట్ డిజాస్టర్ గా పేరుపొందిన బ్రహ్మోత్సం దిల్ రాజుకు నష్టం కలిగించలేదు. కారణం, ఆయన ఆ సినిమా జోలికి పోలేదు. నిజానికి ఆ సినిమా నైజాం రైట్స్ కొనుక్కోవాలని గట్టిగా అనుకున్నాడట. కానీ సినిమా ఎలా తీశారో తెలిసిన తర్వాత, హిట్టయ్యే చాన్స్ లేదని ఊహించాడట. అందుకే, పెద్ద హీరోల సినిమా అంటే నెలల ముందే రైట్స్ కోసం కర్చీఫ్ వేసుకునే దిల్ రాజు, దూరంగా ఉన్నాడట. దీంతో కాంపిటీషన్ పెద్దగా లేదని సంబర పడుతూ వేరే వాళ్లు రైట్స్ కొనుక్కున్నారు.
శ్రీకాంత్ అడ్డాలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీయించిన దిల్ రాజు, ఆ పరిచయాన్ని పరిచయంగానే ఉంచాడట.
సీతమ్మ వాకిట్లో… మహేశ్ బాబు కూడా నటించాడు. అది సూపర్ హిట్ అయింది. కాబట్టి బ్రహ్మత్సవం సినిమా రైట్స్ ను ఎంత డబ్బయినా పెట్టి కొంటాడని చాలా మంది భావించారు. కానీ, రాగల డిజాస్టర్ ను ముందే ఊహించాడట దిల్ రాజు.
అంతకు ముందు సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనూ దిల్ రాజు నష్టాన్ని తప్పించుకున్నాడట.
పవన్ కల్యాణ్ సినిమా నైజాం రైట్స్ అంటే భారీగానే డిమాండ్ ఉంటుంది. అయితే ఎందుకో ఆ సినిమా అంత సక్సెస్ ఫుల్ కాదనే అనుమానంతో రైట్స్ కొనుక్కోలేదట. అలా బతికిపోయాడు. ఇలా తక్కువ గ్యాప్ లో రెండు పెద్ద హీరోల సినిమాలకు డిజాస్టర్ టాక్ రావడం టాలీవుడ్ లో అరుదే.
రాంచరణ్ బ్రూస్ లీ సినిమా దెబ్బతో దిల్ రాజు ఈ మధ్య ఆచితూచి వ్యవహరిస్తున్నాడట. ఏదైనా సినిమా రైట్స్ కొనే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నాడట. అందులోని ఎలిమెంట్స్ ఏమిటి, హిట్టయ్యే చాన్సుందా లేద ఫట్టవుతుందా అనే లెక్కలు పక్కాగా వేసుకున్న తర్వాతే రంగంలోకి దిగుతున్నాడట. డబ్బులున్నాయి కదా అని గుడ్డిగా పెట్టుబడి పెట్టవద్దనే సూత్రాని తు చ తప్పకుండా ఫాలోఅవుతున్నాడట.