రమ్యకృష్ణ లైఫ్‌లోనే మర్చిపోలేని చిత్రం నరసింహా. ఇందులో హీరో రజనీకాంతే కావొచ్చు. కానీ రజనీ ముందు.. నిలబడి దడదడలాడించింది రమ్యకృష్ణ. నీలాంబరిగా ఆమె నటన.. అందులో ఆమె చూపించిన నైపుణ్యం సింప్లీ సూపర్బ్. అందుకే నరసింహా అనగానే ముందు గుర్తొచ్చేది రజనీకాంత్ కాదు, అచ్చంగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అవతారమే. ఆ సినిమా తరవాత రజనీ – రమ్యల కాంబినేషన్ రిపీట్ చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు శంకర్ దాన్ని సాధించాడు.
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా రోబో 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. మరో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణని ఎంచుకొన్నారు. బాహుబలి తరవాత రమ్యకృష్ణ చాలా ఆచితూచి సినిమాల్ని ఎంచుకొంటోంది. కథ, పాత్ర నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముందు శంకర్ ప్రతిపాదన తిరస్కరించిన రమ్య.. చివరికి కథ విని, పాత్ర నచ్చడంతో ఓకే చెప్పిందట. మరి ఈసారి.. ఈ కాంబినేషన్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.