సినిమాల్లో లిప్ లాక్‌లు ఈమధ్య మహా కామన్ అయిపోయాయి. అందునా బాలీవుడ్ సినిమా అయితే ఇంకానూ. సినిమాకి టైటిల్ కార్డు ఎంత ముఖ్యమో… లిప్ లాక్ కూడా అంతే ముఖ్యం అన్నంతగా ఫిక్సయిపోయారు. పోతే పోనీ ఆ ముద్దులన్నీ వెండి తెరపై ఉత్తుత్తిగానే కదా, అనుకొంటే.. రియల్ లైఫ్‌లోనూ నిజ్జంగా ఘాటుముద్దులు ఇచ్చిపుచ్చేసుకొంటున్నారు. ఇప్పుడు లక్ష్మీరాయ్ కూడా అదే చేసింది. లిప్‌లాక్ సీన్.. తెరపై హీరోతో కాకుండా, సెట్లో దర్శకుడితో పండించి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే..
లక్ష్మీరాయ్ రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకొని బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది. అదే జూలీ 2. జూలీ తొలి భాగంలో నేహా ధూపియా లిక్ లాక్‌లతో రెచ్చిపోయింది. ఇప్పుడా బాధ్యతను రాయ్‌లక్ష్మీ తీసుకొంది. జూలీ నిండా పెదవెంగిలి సన్నివేశాలేనట. అయితే ఇలాంటి సీన్లలో నటించడం రాయ్ లక్ష్మీకి బహు కొత్త. అందుకే సెట్లో కాస్త కంగారు పడిందట. ఇలా ఓ ఘాటు ముద్దు సీన్ టేకులపై టేకులు చేస్తుంటే… ఆ దర్శకుడు దీపక్ ష్రివ్దాసిని ఆగలేక లక్ష్మీరాయ్ ముందుకొచ్చి.. ఘాటైన లిప్ లాక్ ఇచ్చేసి ‘ముద్దు ఇలా పెట్టాలి’ అని చూపించాడట. ఆ దర్శకుడి ఓవర్ యాక్షన్‌కి సెట్లో ఉన్నవాళ్లంతా షూట్ అయ్యారని తెలుస్తోంది. అయితే లక్ష్మీ రాయ్ మాత్రం కాస్త రొమాంటిక్‌గా ఫీలై.. ఆవెంటనే లిప్ లాక్ సీన్‌ని సింగిల్ టేక్‌లో చేసేసిందట. జూలీ 2లో హీరో హీరోయిన్ల కంటే, హీరోయిన్‌కీ దర్శకుడికీ కెమిస్ట్రీ సూపర్‌గా కుదిరిందని గుసగుసలాడుకొంటున్నారు. మరి దాని వెనుక రహస్యం ఏమిటో?