అల్లు అరవింద్ దగ్గర అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో చట్టుక్కున గ్రహించగలరు. అవకాశాలూ అలానే ఇస్తుంటారు. అలానే యాంకర్ కమ్ యాక్టర్ ఈవీటీ ప్రభాకర్‌కి దర్శకుడిగా ఛాన్సిస్తానని మాటిచ్చాడు. దాంతో ప్రభాకర్ రెండేళ్లుగా గీతా ఆర్ట్స్ చుట్టూనే తిరుగుతున్నాడు. కథ ఓకే అయ్యింది. సెటప్ అంతా రెడీగా ఉంది. కానీ సినిమా ఎప్పుడు అనేది అల్లు అరవింద్ చెప్పడం లేదట. ఇటీవలే శిరీష్‌కి సంబంధించిన మరో కొత్త సినిమా పట్టాలెక్కేసింది. దీన్ని బట్టి చూస్తే 2016లో ప్రభాకర్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదు.
దాంతో ప్రభాకర్ పూర్తిగా అసంతృప్తిలో ఉన్నాడట. ఈ సినిమా చేస్తారో లేదో చెప్పేస్తే నా దారి నేను చూసుకొంటా కదా, అంటున్నా.. అరవింద్ ఒక్క మాట కూడా చెప్పడం లేదట. ఆ కథని శిరీష్ కాకపోతే మరో హీరోతో చేయాలని ప్రభాకర్ ప్రయత్నం. అల్లు శిరీష్ కంటే మంచి హీరోలు దొరక్కపోతారా అని ఎదురుచూస్తున్నాడట. ఒకరిద్దరు హీరోలకు ఆ కథ కూడా చెప్పి ఉంచాడని, అయితే ఆల్రెడీ కమిట్మెంట్ గీతా ఆర్ట్స్ దగ్గర ఉంది కాబట్టి ప్రభాకర్ లాక్ అయిపోయాడని తెలుస్తోంది. మరి రెండేళ్లు గీతా ఆర్ట్స్ చుట్టూ తిప్పించుకొని ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడం కూడా న్యాయం కాదు. మరి అరవింద్ ఏం చేస్తారో??