అ.ఆ సమంత కెరీర్లో చాలా కీలకమైన సినిమా. బ్రహ్మోత్సవం ఫ్లాప్‌తో తల్లడిల్లిన ఈ చెన్నై సోయగానికి ఈ సినిమా హిట్టవ్వడం చాలా రిలీఫ్ ఇచ్చింది. పైగా ఇది హీరో డామినేషన్ ఉన్న కమర్షియల్ సినిమా కాదెయె. దాదాపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగానే చలామణీ అయ్యింది. దాంతో త్రివిక్రమ్ తరవాత ఎక్కువ క్రెడిట్ ఎత్తుకెళ్లిపోయింది. అన్నట్టు ఈ సినిమాలో సమంత కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా కనిపించాయి. ఆమె సరికొత్తగా ముస్తాబైంది. చుడ్డానికి కాస్ల్టీ గా కనిపించికపోయినా.. ఆ దుస్తులు మహా కాస్ల్లీ అట. మిలియనీర్ మహాలక్ష్మి కూతురు కదా.. ఆ మాత్రం ఖరీదైన దుస్తులు వేయాల్సిందే అని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడట. సమంత పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన.. సమంత కోసం ప్రత్యేకమైన దుస్తుల్ని డిజైన్ చేసిందట. అందుకోసం అక్షరాలా రూ.12 లక్షలు ఖర్చు పెట్టారట.
ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ హైదరాబాద్‌లో ఓ బొటిక్ పెట్టారు. అక్కడ్నుంచి కూడా సమంత దుస్తులు దిగుమతి అయ్యాయట. అవి కూడా కలుపుకొంటే సమంత దుస్తులకే పదిహేను లకారాల వరకూ అయ్యిందని టాక్. సాధారణంగా హీరో కాస్ట్యూమ్స్‌పై ఇన్ని లక్షలు ఖర్చు పెడుతుంటారు. కానీ సమంత దుస్తులపై ఇంత ధారబోయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా హిట్టయ్యింది కాబట్టి.. ఈ లెక్కలు ఓ లెక్కలోనికి రావుగానీ, అదే తేడా కొట్టుంటే… ఇదే పెద్ద ఇష్యూ అయిపోయేది.