ఈ శుక్రవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒక్క అమ్మాయి తప్ప, రైట్ రైట్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. రెండింటిలో ఒక్క అమ్మాయి తప్పనే కాస్త పెద్ద సినిమా అనుకోవాలి. సందీప్ కిషన్, నిత్యమీనన్ కలసి నటించి ఈసినిమా.. ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తిని రగిలించడంలో సఫలమైంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే సందీప్ మరోసారి ఏదో ఓ వినూత్నమైన ఐడియాని ఎంచుకొన్నట్టే కనిపిస్తోంది. మరోవైపు సుమంత్ అశ్విన్ కండెక్టర్ పాత్రలో రైట్ రైట్ సిద్దమైంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ఆర్డినరీ సినిమాకి ఇది రీమేక్. కాబట్టి ఇది కూడా కంటెంట్ ఉన్న మూవీలానే కనిపిస్తోంది.
అయితే పబ్లిసిటీ విషయంలో సందీప్ కిషన్ కంటే సుమంత్ అశ్వినే ముందున్నాడు. ఒక్క అమ్మాయి తప్ప పై బజ్ ఏర్పడినా… దాన్ని కాపాడుకొనే దిశగా పబ్లిసిటీని ముమ్మరం చేయలేకపోయింది టీమ్. రైట్ రైట్ మాత్రం…. పబ్లిసిటీ పరంగా దూసుకెళ్లింది. కంటెంట్ పరంగా ఒక్క అమ్మాయి తప్ప సినిమాకి మంచి మార్కులు పడబోతున్నాయని తెలుస్తోంది. అయితే రైట్ రైట్ కీ పాజిటీవ్ బజ్ వచ్చింది. రెండూ మల్లీప్టెక్స్ ఆడియన్స్ని టార్గెట్ చేసిన సినిమాలే అని..
వాళ్లకు నచ్చినా… లిమిటెడ్ బడ్జెట్ సినిమాలే కాబట్టి గెటిన్ అయిపోవచ్చని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఆడియన్స్ మార్కులు ఏ సినిమాకి పడతాయో, క్రిటిక్స్ ఏ సినిమాని మెచ్చుకొంటారో చూడాలి.