తమ సినిమా విడుదల అవుతోందంటే ఫ్యాన్స్ ని పిలిచి మీటింగ్ పెట్టడం.. మెగా హీరోలకు అలవాటే! మెగా ఇంటి నుంచి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక కూడా ఈ ఆనవాయితీని కొనసాగించింది. నిహారిక కథానాయికగా నటించిన ఒక మనసు విడుదలైకు సిద్దమైంది. ఈ సందర్భంగా నిహారిక ఫ్యాన్స్ తో మీట్ అయ్యింది. వాళ్లతో తన పాత్రకు సంబంధించిన విశేషాలు పంచుకొంది. అందరూ గర్వపడేలా ఒక మనసు సినిమా ఉంటోందని, తొలి సినిమాకే ఇలాంటి పాత్ర దక్కడం తన అదృష్ఠమని చెప్పుకొచ్చింది. ఇక ముందు కూడా మంచి సినిమాల్లోనే నటిస్తానని అభిమానులకు మాటిచ్చింది.
నిహారిక మీటింగ్ భారీ ఎత్తున నిర్వహించాలని అనుకొన్నా.. సమయాభావం వల్ల కుదర్లేదు. వివిధ జిల్లాలనుంచి.. వందలాది మహిళా అభిమానుల్ని హైదరాబాద్ రప్పిద్దామనుకొన్నారు. అయితే అంతగా ఆసక్తి కనబరచకపోవడంతో పట్టుమని 30 మంది కూడా ఈ మీటింగ్‌కి రాలేకపోయారు. దాంతో.. గ్రాండ్‌గా జరుగుతుందనుకొన్న ఈ మీటింగ్ కాస్త చప్పగా సాగింది. మహిళా అభిమానులకు మాత్రమే పిలుపు రావడం పట్ల.. మెగా ఫ్యాన్స్కాస్త కినుక వహించారని టాక్. అందరినీ పిలిస్తే బాగుండేది కదా.. అని నిహారికకు సన్నిహితులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు.