కలిసొచ్చే కాలం వస్తే… నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు..కొన్ని సినిమాలకు అన్నీ భలే భలేగా కలిసొస్తాయి. అ.ఆకీ అంతే. సమ్మర్ లో పెద్ద సినిమాల్నీ వెళ్లిపోయాక.. కామ్‌గా వచ్చింది అ.ఆ. సర్దార్, బ్రహ్మోత్సవం దెబ్బకు కుదేలైపోయిన సినీ అభిమానులకు అఆ ఓ అద్భుతంలా తోచింది. దాంతో వసూళ్లు ఇరగదీస్తున్నాయి. దానికి తోడు.. అ.ఆకి పోటీనిచ్చే సినిమా ఒక్కటీ లేదు. ఈ వారం రెండు సినిమాలొచ్చాయి. ఒక్క అమ్మాయి తప్ప… రైట్ రైట్ విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలూ ఫ్లాప్ టాక్ తెచ్చుకొన్నాయి. దానికి తోడు ఓపెనింగ్స్ కూడా లేవాయె. దాంతో.. ఈ వీకెండ్లోనూ అఆకు ఎదురులేకుండా పోతోంది. వచ్చేవారం నాని జెంటిల్మెన్గా కనిపించబోతున్నాడు. నాని సినిమా కాబట్టి జెంటిల్‌మెన్‌కి క్రేజ్ ఉంటుంది. అయితే…అ.ఆకి పోటీ ఇచ్చేంత ఉండకపోవొచ్చన్నది ట్రేడ్ వర్గాల టాక్.
జెంటిల్మెన్ ఎంత బాగున్నా… అ.ఆకు ఉండాల్సిన వసూళ్లు ఉంటాయని.. పెద్ద సినిమాలేవీ లేకపోవడం వల్ల ఈ జూన్ అంతా అ.ఆ సందడి చేసే అవకాశం ఉందిని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ అ.ఆ చూడ్డానికి ఇప్పుడే.. బయటకు వస్తున్నారని, ఫ్యామిలీ ఆడియన్స్ తో ఈ వీకెండ్ అ.ఆ థియేటర్లు నిండిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రూ.50 కోట్లు దాటేసిన అ.ఆ కి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తోడైతే… కెవ్వు కేకే,