నయనతార తన రూటు ఎప్పుడో మార్చేసుకొంది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయడం లేదు. తన పాత్రలో డెప్త్ ఉంటేనే ఒప్పుకొంటోంది. మరీ లేడీ ఓరియెంటెడ్ అని చెప్పలేం గానీ, దాదాపుగా అలాంటి సినిమాలనే ఒప్పుకొంటోంది. ఆమద్య మయూరిగా భయపెట్టింది నయనతార. ఓ హారర్ చిత్రంలో నయన నటించడం అదే తొలిసారి. ఇప్పుడు మరోసారి హారర్ సినిమా ఒప్పుకొంది. నయనతార కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. మురగదాసు రామస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈనెల 18న షూటింగ్ ప్రారంభిస్తారు.
మయూరిలా ఇది కూడా భయపెట్టే సినిమానేనట. నయన పాత్రే ఈ సినిమాకి మేజర్ హైలెట్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి ముందుగా కాల్షీట్లు ఇచ్చినందుకే… బాలయ్య వందో సినిమాకి నయన డుమ్మా కొట్టిందని టాక్. మరి అంతగా ఈ కథలో నయనకు ఏం నచ్చేసిందో?? సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాని పూర్తి చేసి 2016 చివర్లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.