ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షను విరమింపజేయడానికి తెలుగుదేశంతోనూ, కాపుఉద్యమ నాయకులతోనూ సంబంధాలు వున్న మధ్యవర్తులు ఒక రాజీ ఫార్ములాను రూపొందించారు.
ఈ ఫార్ములా ప్రకారం 1) ఉద్యమ సందర్భంగా జరిగిన సంఘటనలపై భవిష్యత్తులో అరెస్టులు వుండవు 2) ఇప్పటికే రిమాండులో వున్నవారిని పోలీసులు కోర్టుల్లో హాజరు పరుస్తారు. ఉద్యమకారులు వారికి బెయిల్ ఏర్పాట్లు చేస్తారు. ప్రాసిక్యూషన్ వైపు నుంచి బెయిల్ కు వ్యతిరేకంగా పిటీషన్లు వేయరు.3) కాపులకు బిసిల రిజర్వేషన్ వర్తింపచేయాలని కమీషన్ సిఫార్సును జతపరస్తూ ఆమేరకు చట్టం చేయాలని కేంద్రాన్ని కోరుతూ సెప్టెంబరు లో జరిగే శాసనసభలో తీర్మానం చేయాలి
ఈ ఫార్ములాకు ఉద్యమకారులూ, ప్రభుత్వమూ ఒప్పుకుంటే ఆందోళన ముగిసినట్టే! దీన్ని రూపొందించిన మధ్యవర్తుల్లో కాపు ఉద్యమనాయకులు, అదేసామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం నాయకులు వున్నారు. ఇందుకు చంద్రబాబుని ఒప్పించే బాధ్యత తెలుగుదేశం నాయకులు, ముద్రగడను ఒప్పించే బాధ్యత కాపునాయకులూ నెత్తికెత్తు కున్నారని తెలిసింది. రెండువైపులా వెలువడుతున్న సంకేతాలనుబట్టి ఏక్షణంలోనైనా దీక్షవిరమణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.