నాని జెంటిల్ మెన్ గా అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో కథానాయకుడు, ప్రతినాయకుడు ఇవి రెండూ నానినే. అంటే డ్యూయెల్ రోల్ చేశాడా, ఒక్కటే రెండు పాత్రల్లో కనిపించనున్నాడా? ఇదే ప్రశ్న నానిని అడిగితే.. ”ఇదో థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన ఏ క్లూ బయటకు ఇవ్వకూడదు. అవన్నీ టాప్ సీక్రెట్స్. నేను ఒకరా, ఇద్దరా అన్నది సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే తెలిసిపోతుంది. ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు” అంటున్నాడు నాని. ఈ సినిమా కేవలం కథ నచ్చే ఒప్పుకొన్నానని, ఇంద్ర గంటి మోహన్ కృష్ణ తనకు లైఫ్ ఇచ్చారన్న ఆబ్లికేషన్స్ తో ఈ సినిమా ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు నాని.
”ఇంద్రగంటి నాకు లైఫ్ ఇచ్చారు. అయితే అందుకోసం ఈ సినిమా చేయలేదు. ఒకవేళ నా మనసులో అలాంటి ఫీలింగ్ ఉన్నా, నేనేదో ఆబ్లికేషన్ కోసం ఈ సినిమా ఒప్పుకొన్నా… ఇంద్రగంటి నాతో ట్రావెల్ చేయరు. ఈ సినిమాకి ముందు ఓ పెద్ద దర్శకుడు, పెద్ద నిర్మాత నాతో కలసి సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కానీ ఆ సినిమాని పక్కన పెట్టి జెంటిల్ మెన్ ఒప్పుకొన్నా. ఆ కథ అంత బాగా నచ్చింది” అంటున్నాడు నాని. మరి జెంటిల్మెన్ నాని నమ్మకాన్ని ఎంత వరకూ నిలబెడుతుందో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాలి.