యువ కథానాయకుడు సందీప్ కిషన్‌కి గాయాలయ్యాయి. సెట్లో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో సందీప్ తలకు గాయమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో సందీప్ చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్లే… సందీప్ కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. ఈరోజు సందీప్‌పై యాక్షన్ సన్నివేశాలన్ని తెరకెక్కిస్తుండగా ప్రమాదవశాత్తూ సందీప్ తలకు గాయమైంది. వెంటనే చిత్రబృందం సందీప్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సందీప్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, కొన్ని రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇచ్చినట్టు సమాచారం. సందీప్ నటించిన ఒక్క అమ్మాయి తప్ప ఇటీవలే విడుదలైంది. సందీప్ కథానాయకుడిగా నటించిన రెండు తమిళ చిత్రాలు రిలీజ్‌కి సిద్ధమయ్యాయి.