ఈమధ్య రామ్‌చరణ్ కొత్త సినిమా ధ్రువ ఫస్ట్ లుక్ అంటూ ఓ పోస్టర్ బయటకు వచ్చింది. చెర్రీ ఫొటోపై అంకెలూ, గణిత సూత్రాలూ కనిపించే సరికి… ‘సినిమా కథకి తగ్గట్టు భలే డిజైన్ చేశార్రా బాబూ’ అని అందరూ అటు సురేందర్రెడ్డినీ, ఇటు రామ్‌చరణ్ నీ తెగ మెచ్చుకొన్నారు. అయితే.. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ శుద్ద కాపీ అని తేలింది. ఈ పోస్టర్ ఇన్ఫినిటీ అనే ఓ బాలీవుడ్ చిత్రం పోస్టర్ని పోలి ఉంది. ”పోలికలు కాదు.. రెండూ ఒకటే. ఆ పోస్టర్‌నే కాపీ కొట్టారు” అంటూ విమర్శకుల కాస్త గట్టిగానే చెబుతున్నారు. రెండు పోస్టర్లూ పక్కపక్కన పెట్టి చూస్తే అదే అనిపిస్తోంది కూడా.
ఇప్పటికిప్పుడు ధృవ పోస్టర్ని అర్జెంటుగా విడుదల చేయాల్సిన అవసరం ఏం రాలేదు. జస్ట్ ఫ్యాన్స్‌ని కాస్త థ్రిల్ చేద్దామని సోషల్ మీడియాలో జస్ట్ అలా వదిలారంతే. చూడగానే బాగా నచ్చేసింది. చూడగా చూడగా.. ఎక్కడ నుంచి కాపీ కొట్టారో తెలిసింది. దీనికి సురేందర్ రెడ్డి అండ్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఇక ఎలాంటి బ్రేకులూ లేకుండా ఈ సినిమా షూటింగ్ ముగించాలని చిత్రబృందం భావిస్తోందట. దసరా బరిలో ఈ సినిమాని నిలపాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అప్పటికి ఈ సినిమా సిద్ధం చేయాలంటే.. రాత్రీంబవళ్లూ కష్టపడాల్సిందే.