హెచ్‌సియులో కుల వివక్షకు నిరసనగా ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళితుడేనని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దాండే నిర్ధారించారు.ఈ మేరకు జాతీయ షెడ్యూలు కులాల కమిషన్(ఎస్‌సిఎస్‌సి)కు తన నిర్ధారణలు పంపించారని తెలిసింది. అధికారికంగా వెల్లడైంది. ఈ జిల్లా కలెక్టర్ నివేదికనే కీలక సాక్ష్యంగా పరిగణిస్తారు. రోహిత్ వేముల చక్రవర్తి హిందూ మాల అనీ, రాజ్యాంగ ప్రకారం ఇది ఎస్సి కులాల జాబితాలో వుందని కలెక్టర్ నివేదికలో తెలిపారు. .రోహిత్ వేముల విషాదమరణం తర్వాత హెచ్‌సియు ఆందోళనలతో అట్టుడికిపోయింది. దేశమంతటా దీనిపై వివాదం నడిచింది. ఎస్సిఎస్టి అత్యాచార నిరోధక చట్టం కింద వైస్‌ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలతో సహా పలువురిపై కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత దశలో రోహిత్ అసలు దళితుడే కాదంటూ దుమారం ఒక మీడియా సంస్థ ఒక కథనం ప్రచురించింది. స్వయానా తల్లి రాధిక తాము దళితులమనీ అలాగే పెరిగామనిచెబుతున్నావిచారణ పేరిట తెలంగాణ పోలీసులు రోహిత్ స్వగ్రామం వెళ్లారు. తండ్రి మణికుమార్ కూడా ఈ చర్చలో జోక్యం చేసుకుని అతని దళిత నేపథ్యాన్ని ప్రశ్నించేవిధంగా మాట్లాడ్డం విమర్శకులను తీవ్రం చేసింది. తనను ఒక మహిళ పెంచుతున్నానంటూ చాకిరీ చేయించుకొంటూ ఒక వడ్డెర కిచ్చి పెళ్లి చేసిందని రాధిక వెల్లడించారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నాక రోహిత్ తల్లిదగ్గరే పెరిగాడు.కనిపెంచిన తల్లి కులం రోహిత్‌కు చెందుతుందనేది కోర్టు తీర్పుల రీత్యా అంగీకరించాల్సిన విషయం. అసలు బహుశా ఆందోళనను దెబ్బతీయడానికి రోహిత్ శవంపై కుల పంచాయితీ ఎందుకన్న భావం చాలామందిలో వ్యక్తమైంది. బహుశా పెద్దలను కేసు నుంచి తప్పించడానికి ఇదంతా జరిగినట్టు కనిపిస్తుంది.అయితే హైకోర్టు మాత్రం ఆ కేసు విచారణ వాయిదా వేయడానికి అంగీకరించలేదు. స్థానిక నేతలు చెప్పిన ఈ అవాస్తవాలనే కేంద్ర మంత్రి సృతి ఇరానీ పార్లమెంటు సాక్షిగా దేశమంతా వినిపించారు.. ఇప్పుడు కలెక్టర్ నివేదిక వచ్చింది గనక ఏం చేస్తారో చూడాల్సిందే. ఎన్‌సిఎస్‌సి బహుశా ఈ ఆగష్టులో నివేదికను పరిశీలించవచ్చునని కేసు వాదిస్తున్న న్యాయవాది ఎస్.గుణరతన్ చెబుతున్నారు.
ఈ వివాదంలో విద్యార్థుల ఆందోళనకు స్పందించి ప్రజాస్వామిక పరిష్కారం కనుగొనేబదులు ప్రభుత్వం, విసి తదితరులు కూడా కక్ష సాధింపువైఖరితో చర్యలు తీసుకున్నారు. చదువులు పాడవుతున్నాయంటూ వారిలో వారికి చీలికలు తెచ్చే ప్రయత్నంచేశారు. ఈ వారంలో ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేశారు. మరోవైపున విసి ధోరణికి ఇందుకు నిరసనగా ఇద్దరు ప్రొఫెసర్లు తమ బాధ్యతలకు రాజీనామా చేశారు.ఈ సమస్యలో ఎలాటి చొరవ చూపని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఆ విసిని వెనక్కు పిలిపించాలని శాసనసభలోనే కోరారు. అయినా కేంద్రం ఆయననే పట్టుకుని వేళ్లాడుతూ విద్యార్థులు అధ్యాపకులపై వేటు వేస్తున్నారంటే వారి వెనక చాలా బలీయమైన రాజకీయ శక్తులున్నాయని తేలిపోతుంది. బిజెపి నేతలు చాలా మంది కూడా ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడునే తప్పుపడుతున్నారు.