రేష్మి.. జబర్దస్త్ యాంకర్. తెలుగు టీవీ తెరపై యాంకర్‌గా ఇంతగా గ్లామర్ షో చేసినవాళ్లెవ్వరూ లేరేమో? అందుకే.. వెండి తెరపై రేష్మీ హాట్ బాట పట్టడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. గుంటూర్ టాకీస్‌లో దుమ్ము రేపే అందాలతో షాక్ ఇచ్చింది. రేష్మీ కోసమే సీ సెంటర్లు ఫుల్ అయ్యాయంటే.. నమ్మి తీరాల్సిందే. చిన్న సినిమాగా వచ్చి కోట్లు కొల్లకొట్టి వెళ్లిన గుంటూర్ టాకీస్ విజయంలో రేష్మి పాత్ర కూడా బోల్డంత ఉంది. అందుకే రేష్మికి అంత డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఆమెతో అంతం అనే సినిమా మరోటి రెడీ చేశారు. విడుదలకూ ఈ సినిమా సిద్ధమైంది, అన్నట్టు ఇందులోనూ రేష్మి చలరేగిపోయిందని టాక్.
నిజానికి ఇదో థ్రిల్లర్. కానీ రేష్మి అందాలు చూపించకపోతే ఎలా? అందుకే పాటలు, రొమాంటిక్ సీన్లతో రేష్మిని కొత్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడట దర్శకుడు కల్యాణ్. ఆ గ్లామర్ షోకు సెన్సార్ బోర్డు కూడా బిత్తరపోయి.. ఏ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఈ సినిమాలో రేష్మి ఉందన్న ఒకే ఒక్క కారణంతో.. బయ్యర్లు మంచి రేట్లకు సినిమాని కొనేశారు. దాంతో చిత్ర బృందానికి టేబుల్ ప్రాఫిట్ దక్కిందని సమాచారం.