ఏఆర్రెహమాన్.. ఆయనకు అభిమానులు కాని వాళ్లెవ్వరు?? ఆ పాటలు విని మంత్రముగ్థులవ్వని వాళ్లెవ్వరు? నాగార్జున కూడా రెహమాన్ పాటలకు ఫ్యానే. రెహమాన్ పాటలు వింటూ.. రెహమాన్ పాటల్లో మునిగిపోతు.. రెహమాన్ పాటలనే స్ఫూర్తిగా బతికేవాళ్లలో నాగ్ కూడా ఒకడట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా చెప్పాడు. రెహమాన్ పాటలకు నాగ్ వీరాభిమాని అట. సాహసం స్వాసగా సాగిపో చిత్రానికి రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ పాటలు వింటూ నాగ్ మైమరచి పోయాడట. అందులో ‘వెళ్లిపోమాకే’ పాటవింటూ కన్నీళ్లు పెట్టుకొన్నాడట. ఈ విషయాన్ని నాగార్జునే చెప్పుకొచ్చాడు.
ముఫ్పయి ఏళ్ల కెరీర్లో కేవలం ఒక్కసారే రెహమాన్ తో పనిచేసే అవకాశం వచ్చిందని, చైతూ మాత్రం ఇప్పటికి రెండు సార్లు రెహమాన్ తో వర్క్ చేశాడని కాస్త జెలసీ ఫీలవుతున్నాడు నాగార్జున. దర్శకుడు గౌతమ్ మీనన్ విషయంలోనూ నాగ్‌కి ఈ కంప్లైంట్ ఉంది. ”మీతో ఓ సినిమా చేస్తా సార్… అని గౌతమ్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. కానీ… చైతూతో సినిమాలు చేస్తుంటాడు. గౌతమ్‌తో ఓ సినిమా చేయడానికి ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నా” అంటున్నాడు నాగార్జున. మరి గౌతమ్ మీనన్ ఏమంటాడో?