ఇది వరకు బాలీవుడ్ కథానాయికలకే రూమర్ల బెడద ఉండేది. దానికి తగ్గట్టుగానే వాళ్లూ ప్రేమాయాణాలు జోరుగా నడిపేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ టాలీవుడ్‌కీ పాకింది. ప్రతీ కథానాయిక వెనుక… ఏదో ఓ లవ్ గాసిప్ తిరుగుతోంది. సమంత, రెజీనా, రాశీఖన్నా… వీళ్లంతా లవ్ మేటర్‌లో చిక్కుకొన్న వాళ్లే. ఇప్పుడు అంజలి వంతు వచ్చింది. ఓ తమిళ హీరోతో అంజలి చాలా క్లోజ్ గా మూవ్ అవుతోందని తమిళ చిత్ర వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. ఆ హీరో ఎవరో కాదు. జై. అంజలితో జై ఓ సినిమా చేశాడు. ఇప్పుడు ఇద్దరు కలసి మరోసారి జత కట్టబోతున్నారు.
జై కథానాయకుడిగా ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా ఎవరిని తీసుకొందాం.. అని చిత్రబృందం ఆలోచిస్తున్నప్పుడు జై.. అంజలి పేరు ప్రపోజ్ చేశాడట. దాంతో చిత్రబృందం అవాక్కయ్యింది. అంజలి వద్దు… అని చెప్పినా – అంజలిని తీసుకోవాల్సిందే అని జై పట్టుపట్టడంతో అంజలి – జైల వ్యవహారం బయటకుపొక్కింది. వీరిద్దరూ బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టు.. ఈమధ్య అంజలి జైకి ఓ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో మరి?!