నిత్యమీనన్ ఉంటే, సినిమాలో ఎంత మంది ఉన్నా తనదే డామినేషన్. కరెక్టయిన పాత్ర పడితే అల్లాడించేస్తుంది. అందుకే నిత్య ఉందంటే.. హీరోలు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. నిత్య డామినేషన్ సినిమాకి ప్లస్ అవుతుందన్న నమ్మకంతో.. నిత్యని కాస్త భరిస్తుంటారంతే. ఇద్దరు హీరోయిన్లతో పోటీ పడితే.. నిత్యకే మార్కులు వేసేయాలనిపిస్తుంది. నిత్య ముందు ఎవ్వరి పప్పులూ ఉడకవు మరి. జనతా గ్యారేజ్ విషయంలోనూ అదే జరుగుతోందట. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలో సమంత, నిత్యమీనన్ కథానాయికలు. అయితే సమంత కంటే నిత్య పాత్రే పవర్ఫుల్గా ఉంటుందని, సినిమా చూసొచ్చాక నిత్య పాత్రే వెంటాడుతుందని తెలుస్తోంది.
కొరటాల నిత్య పాత్రని అంత బాగా డిజైన్ చేశాడట. సమంత పాత్ర ప్రజెంట్లోనూ, నిత్య పాత్ర ఫ్లాష్ బ్యాక్లోనూ వస్తుందని.. సమంత తో పోలిస్తే నిత్యకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. నిత్య, సమంత ఒకేసీన్లో కనిపించకపోయినా.. నిత్య డామినేషన్ మాత్రం ఆడియన్స్కి అర్థమైపోతూనేఉంటుందట. సన్నాఫ్ సత్యమూర్తిలోనూ సమంత, నిత్య హీరోయిన్లుగా కనిపించారు. అయితే అందులో నిత్య పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ఈసారి మాత్రం.. నిత్య రివైంజ్ ఇలా తీర్చుకొంటోందన్నమాట.