పవన్ కల్యాణ్ – ఎస్.జె సూర్య కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా సెట్స్‌కి వెళ్లే లోగా ఊహించని మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టు నుంచి ఎస్.జె.సూర్య తప్పుకొన్నాడు. ఆస్థానంలో గోపాల గోపాల ఫేమ్ డాలీ వచ్చి చేరాడు. ఇటీవల సూర్య నటుడిగానూ బిజీ అయినసంగతి తెలిసిందే. నటుడిగా తనకు వరుసగా అవకాశాలొస్తున్నాయి. మురుగదాస్ – మహేష్ సినిమాలోనూ సూర్య నటిస్తున్నాడు. తనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల.. ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలు మోయలేకపోవడం వల్ల.. సూర్య ఈ సినిమా నుంచి తప్పుకొన్నాడట. అయితే సూర్య నిష్క్రమణ.. పరస్పర అంగీకారంతోనే జరిగిందని చిత్రబృందం తెలిపింది. పవన్ – సూర్య- నిర్మాత శరత్ మరార్ సరప్పరం చర్చించుకొన్నాకే ఈ నిర్ణయానికి వచ్చారట. గోపాల గోపాల సమయంలోనే `నీతో మరో సినిమా చేస్తా` అని డాలీకి మాలిచ్చాడు పవన్. దాన్ని ఇలా నిలబెట్టుకొన్నాడు. మొత్తానికి డాలీకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. దర్శకుడు మారడం వల్ల.. షెడ్యూల్లో స్పల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.