బాలయ్య సినిమా అంటే.. డైలాగులే గుర్తొస్తాయి. ఎలాంటి డైలాగైనా సరే.. బాలయ్య తనదైన శైలిలో పలికే సరికి.. ఆ సంభాషణకు కొత్త సొగసు వచ్చేస్తుంది. ఇక సంస్క్రృత సమాసాల గురించి అయితే చెప్పక్కర్లెద్దు. అలాంటి డైలాగులు పలకాలంటే బాలయ్య తరవాతే ఎవరైనా! అందుకే గౌతమి పుత్ర కోసం క్రిష్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని సంభాషణలు రాయిస్తున్నాడు. కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు… ఈ సినిమాల్లో తన సంభాషణలతో ఒక్కసారిగా సాహితీ అభిమానుల్ని తనవైపుకు తిప్పుకొన్న బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఆ డైలాగులు అదిరిపోయాయని విశ్వసనీయ వర్గాల టాక్. రాజదర్బార్‌లో బాలయ్య పలికే సంభాషణలు ఈసినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.
ఉగాది సంప్రదాయాన్ని ప్రారంభించింది గౌతమి పుత్ర శాతకర్ణినే. అసలు ఉగాది ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి? అనేది చెప్పడానికి ఓ సన్నివేశాన్ని డిజైన్ చేశారిందులో. ఆ సన్నివేశంలో బాలయ్య చెప్పే డైలాగులు అద్భుతంగా కుదిరాయట. ఆ డైలాగులకు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వక తప్పదన్నంత అద్భుతంగా వచ్చాయట. సంస్క్రృత సమాసాలున్నా.. డైలాగులు సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకొన్నట్టు టాక్. కులం, మతం, అమ్మదనం.. వీటిపై ఎక్కువగా డైలాగులు సాగాయట. అవన్నీ ట్రేడ్ మార్క్‌లా నిలిచిపోతాయని టాక్.