హైదరాబాద్: గజిని సినిమాలో మొబైల్ కంపెనీ అధినేతను ప్రేమించే ఆసిన్ నిజజీవితంలోకూడా ఒక మొబైల్ ఫోన్ కంపెనీ అధినేతనే పెళ్ళాడబోతోంది. భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ అయిన మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మతో ఆసిన్ కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. పెళ్ళివార్తలపై స్పందిస్తూ, వ్యక్తిగత జీవితానికి సమయం వెచ్చించటంకోసం ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తున్నానని, కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవటం రెండేళ్ళ క్రితమే ఆపేశానని ఆసిన్ తెలిపారు. మరోవైపు ఆసిన్‌కు, రాహుల్ శర్మకు మధ్య సంబంధం ఏర్పడటానికి తోడ్పడింది వారిద్దరి కామన్ ఫ్రెండ్ అయిన అక్షయ్ కుమార్ అని తెలిసింది. అక్షయ్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా మైక్రోమాక్స్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. అక్షయ్, ఆసిన్ కలిసి ఖిలాడి 786 చిత్రంలో నటించారు.
ఆసిన్ నటించిన ఆల్ ఈజ్ వెల్ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. దీనితో ఆసిన్ కమిట్మెంట్లు పూర్తవుతాయి కాబట్టి తన పెళ్ళి వివరాలను ఆమె త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి.