కో ఇన్సిడెన్స్ అంటారే.. అవి ఎక్కడ ఎదురైనా ఫర్వాలేదు గానీ, సినిమాల విషయంలో ఎదురైతే మాత్రం గందరగోళానికి గురి చేస్తాయి. టాలీవుడ్లో ఒకే కాన్సెప్ట్‌తో రెండు సినిమాలు తయారవ్వడం మామూలు విషయమే. కానీ అవి రెండూ ఒకే సమయంలో సెట్స్‌పై ఉండడం మాత్రం కొత్త విషయం. ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు ఇంచుమించు ఒకే కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఆ రెండు సినిమాలూ…. అభినేత్రి, షో టైమ్.
ఎస్.ఎస్.కాంచి దర్శకత్వం వహిస్తున్న షో టైమ్ టీజర్ ఇటీవలే విడుదలైంది. ఓ థియేటర్లో జరిగే హంగామాని టీజర్ గా కట్ చేసి విడుదల చేశారు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం అభినేత్రి. ఈ విషయం అభినేత్రికి నిర్మాతగా పనిచేస్తున్న కోన వెంకట్ ట్వీట్ చేసేవరకూ అర్థం కాలేదు. షో టైమ్ పోస్టర్ని రాజమౌళి ట్వీట్ చేస్తే.. దాన్ని రీ ట్వీట్ చేశాడు కోన. ”సార్.. మా సినిమా పోస్టర్ కూడా షో టైమ్లానే ఉంటుంది” అంటూ అసలు విషయం రివీల్ చేసేశాడు. థియేటర్లో ఒంటరిగా కూర్చున్న తమన్నా పిక్‌ని బయటపెట్టాడు కోన. దాంతో ఈ రెండు సినిమాలూ ఒకే కాన్సెప్ట్ తో తయారయ్యాయన్న విషయం అర్థమైపోతోంది. అంటే ఒకరి కథ మరొకరు కాపీ కొట్టయినా ఉండాలి, లేదంటే ఇద్దరూ కలసి ఏ హాలీవుడ్ మూవీ అయినా ఎత్తేసి ఉండాలి. ఏదైతేనేం.. ఒక సినిమాకి రెండు టికెట్లు కొనాల్సివస్తోందన్నమాట.
sir I think even our film which is similar to this concept did the same.. Pl see this.. Thank u pic.twitter.com/4QLyITmceV
— KONA VENKAT (@konavenkat99) June 20, 2016