టాలీవుడ్లో లవ్ కహానీలు మామూలే! అప్పుడప్పుడూ హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా నడుస్తుంటుంది. పెళ్లయినా హీరోయిన్ల వెంట తిరిగే ప్రబుద్దులెంతమందో? అయితే ఓ దర్శకుడు, ఓ గాయని మధ్య గత కొంతకాలంగా ఎఫైర్ నడుస్తోందని టాలీవుడ్ టాక్. ఆ దర్శకుడు ఒకప్పుడు లవ్ స్టోరీలు తీసి ఫేమస్ అయ్యాడు. ఆ తరవాత నిర్మాతగానూ మారాడు. ఇప్పుడు ఖాళీనే. అయితే… ఓ గాయనితో బాగా డీప్ లవ్లో ఉన్నట్టు టాక్. అయితే ఆ దర్శకుడికి ఆల్రెడీ పెళ్లయిపోయి, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ గాయనిని మాత్రం వదల్లేదు. తన కోసం… ఇంట్లోవాళ్లనే వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. దాంతో దర్శకుడి ఇంట్లో రోజూ రచ్చ రచ్చ జరుగుతోంది. ‘నీ వల్లే నా కాపురం నాశనమైపోయింది’ అంటూ ఆ దర్శకుడి భార్య.. గాయనిపై తిట్లదండకం అందుకొంటోందట.
దర్శకుడి తరపు బంధువులు ఓసారి గాయనిపై దాడికి కూడా ప్రయత్నించినట్టు టాక్. మొత్తానికి ఈ లవ్ కహానీ ప్రస్తుతానికి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. అన్నట్టు ఆ దర్శకుడికే కాదు… ఈ గాయనికీ అవకాశాలు లేవు. దాంతో బోల్డంత ఖాళీ దొరికిందని తెగ ప్రేమించేసుకొంటున్నారు. తెరపై ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తీసే దర్శకుడు ఇంట్లో ఇల్లాలు – వీధిలో ప్రియురాలు టైపు వ్యవహారాలు నడుపుతున్నాడని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరింతకీ ఆ దర్శకుడు, గాయని ఎవరో మీకేమైనా తెలుసా?