సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే దిశగా మెల్లగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ వేధించిన సస్పెన్షన్ ను ఇప్పటి వరకూ ఎత్తి వేయలేదు. ఇప్పుడల్లా ఎత్తేసే చాన్స్ లేదు. కానీ ఆయనను సర్వీస్ నుంచి తొలగించడానికి ఒక్కొక్క చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా ఆయనకు మద్దతుగా ఎవరూ ముందుకు రాకుండా చర్యలు ప్రారంభించారు.
సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా ఉన్న ఆయన సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు. ఓ రాజకీయ పార్టీ ప్రచారం చేశారు. నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేసేయవచ్చు. దీంతో ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులతో గగ్గోలు రేగింది. సంఘం లోని ఇతర కార్యవర్గం … వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత హోదాలోనే ప్రచారం చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలి కానీ సంఘాన్ని బలి పశువుని చేయవద్దని వేడుకున్నారు.
నిజానికి వెంకట్రామిరెడ్డితో పాటు సంఘంలోని వాళ్లు కూడా అదే పని చేశారు. ఇప్పుడు వారంతా వణికిపోతున్నారు. వెంకట్రామిరెడ్డికి ఇచ్చిన గడువు పూర్తయింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు కమిటీ నియమించాల్సి ఉంది. ఆయనను డిస్మిస్ చేయాలన్న వాదనను మాత్రమే ఉద్యోగులు వినిపించేలా.. ఇప్పటికే ట్యూన్ చేస్తున్నారు. అంతా పద్దతి ప్రకారం పూర్తి చేస్తే వెంకట్రామిరెడ్డి కోర్టుకుకూడా వెళ్లలేరు.. నేరుగా జగన్ ఇంటికి వెళ్లి బోరుమనాల్సిందే