శంషాబాద్ రియల్ ఎస్టేట్ కు అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి. బెంగళూరు జాతీయ రహదారి మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికే శంషాబాద్ హాట్ ప్రాపర్టీ చేసింది. రాను రాను ఐటీ హబ్ కలిసిపోతోంది. ఇప్పుడు ప్యూచర్ సిటీ కూడా ఆశ పెడుతోంది. ఇలాంటి సమయంలో అక్కడ భవిష్యత్ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయినా ఇప్పటికీ అటు వైపు ఇళ్లు తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి.
గ్రేటర్ సిటీ నలువైపులా భారీ నివాస, కార్యాలయ భవన ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. దానికి తగ్గట్లుగానే శంషాబాద్ తో పాటు సమీప ప్రాంతాల్లో జోరుగా నివాస, వాణిజ్య రియల్ ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. శంషాబాద్ మునిసిపాలిటీగా ఏర్పడటంతో అన్నీ మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఉద్యోగులు, మధ్య తరగతి వాళ్లు శంషాబాద్ లో కొనుకకుంటున్నారు. ఐటీ హబ్ కు సమీపంలో ఇళ్లు కొనాలంటే కోటి రూపాయలు అవుతోంది. శంషాబాద్ లో పరిసర ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 50 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. శంషాబాద్ దాటి మరికాస్త ముందుకు కొత్తూరు సమీపంలో 40 లక్షలకే బిల్డర్లు ఇస్తున్నారు.
శంషాబాద్ లో లగ్జరీ ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. బడా నిర్మాణ సంస్థలు కూడా చాలా ప్రాజెక్టులు చేపట్టాయి. డబుల్ బెడ్ రూం..యాభై లక్షలకులోపే వస్తూండగా.. ట్రిపుల్, ఫోర్ బెడ్రూం ఫ్లాట్స్ 56 లక్షల నుంచి 1.29 కోట్ల రూపాయల మధ్య ధరలున్నాయి. శంషాబాద్ లో ప్రాజెక్టును బట్టి ఫ్లాట్స్, విల్లాలతో పాటు ఇండిపెండెంట్ ఇళ్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఎవరి బడ్జెట్ ను బట్టి వాళ్లు తమ డ్రీమ్ హోమ్ ను ఎంపిక చేసుకోవచ్చు. మరో ఏడాది దాటితే మధ్యతరగతికి ఈ ఇళ్లు దూరంగా జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే శంషాబాద్‌కు అన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి మరి.