తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై ఏర్పాటు చేసిన సిట్ వ్యవహారం టీటీడీలో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు చక్రం తిప్పిన పెద్దలకు పెను గండంగా మారే అవకాశం కనిపిస్తోంది. వారు చేసిన అక్రమాలన్నింటినీ ఓ తీగకు కట్టినట్లుగా బయటకు లాగే అవకాశం ఈ సిట్ కు వచ్చింది. టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు చేస్తున్నా.. సిట్ కు ఉండే అధికారాలు వేరు. తిరుమల నెయ్యి కల్తీ వ్యహారం దగ్గర నుంచి బయటకు తీస్తే ఒకదానికి ఒకటి లింక్.. మొత్తం దర్శనాల స్కాం వరకూ బ యటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే .. శ్రీవారిని వ్యక్తిగత అవసరాల కోసం ఎలా మార్కెట్ చేసుకున్నారో కూడా స్పష్టత వస్తుంది.
ఐదేళ్ల పాటు కొండను గుప్పిట్లో పెట్టుకున్న రక్షణ శాఖ మాజీ ఉద్యోగి ధర్మారెడ్డి రిటైరయ్యారు.కానీ ఆయన నోరు తెరవడం లేదు, ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. మొత్తం ఆయనతో పాటు సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే అంతా జరిగింది. తిరుమలలో జరిగిన ప్రతి టెండరు, ప్రతి నియామకం వెనుక రాజకీయ లబ్ది ఉంది. చివరికి వైసీపీకి పాటలు పాడే మంగ్లీ అనే సింగర్ కు .. డబ్బులు కూడా.. సలహాదారు పేరుతో టీటీడీ ఖాతా నుంచి చెల్లించారు. ఇలాంటివి చాలా ఉన్నాయి.
లడ్డు కల్తీ వ్యవహారంతోనే సిట్ సరి పెట్టుకునే చాన్స్ ఉంటే వైసీపీకి ఇంత కంగారు ఉండేది కాదు. కల్తీ తీగ లాగితే డొంక బయటపడుతుందన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఇంకా సిట్ విచారణ ప్రారంభించక ముందే విమర్శలు చేస్తున్నారు. తాము సిట్ ను నమ్మబోమని అంటున్నారు. కానీ ప్రజల ముందుకు వచ్చే సాక్ష్యాలు.. వారిని దోషులుగా నిలబెట్టబోతున్నాయి.