వైసీపీ నేతలను శ్రీవారి భక్తులను ఎలా దోచుకున్నారో వరుసగా అనేక స్కాంలు బయటపడుతున్నాయి. అందులో ఒకటి వీఐపీ దర్శన మాఫియా. వైసీపీ నేతలంతా భక్తులని దర్శన టిక్కెట్లతో దోచుకున్నారు. అందులో మొదటి వ్యక్తి .. సూపర్ స్వామిగా జగన్ రెడ్డి కీర్తించిన వైవీ సుబ్బారెడ్డి. ఆయన కోటాలో నాలుగేళ్లలో దర్శించుకున్న భక్తుల సంఖ్య 3 లక్షల అరవై వేల మంది. అంటే రోజుకు ఒక్క చైర్మన్ కోటాలోనే ఐదు వందల వంది వరకూ దర్శనం చేసుకుంటూ పోయారు.
వీళ్లంతా ఎవరు ?. వీరిలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందినవారే. అంటే.. దర్శనం టిక్కెట్లను ప్రత్యేక కౌంటర్ పెట్టి అమ్ముకున్నారన్నమాట . భక్తుడి స్థాయిని బట్టి టిక్కెట్ డబ్బులు వసూలు చేసి ఉంటారు. ఇందులో కూడా అన్నీ వీఐపీ దర్శనాలే కాదు.. ప్రత్యేక సేవలు కూడా ఉంటాయి. ఇక ఇతర మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంత భారీగా ఒక్క చైర్మనే అమ్ముకుంటే ఇక జంబో టీటీడీ బోర్డులో ఉన్న వారు ఎన్ని అమ్ముకుని ఉంటారు ?. టీటీడీ బోర్డులో లేకపోయినా వారానికోసారి దర్శనానికి వచ్చే రోజా లాంటి వాళ్లు ఎన్ని టిక్కెట్లు అమ్ముకుని ఉంటారు?. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి సిఫారసు లేఖలూ వైరల్ అయ్యాయి.
సామాన్య భ క్తులకు దేవుడిని దూరం చేసే.. శ్రీవాణి టిక్కెట్ ను పదివేల విరాళం పేరుతో వసూలు చేశారు . ఆ డబ్బుల లెక్కలు తేలడం లేదు. ఇప్పుడు ప్రైవేటు కౌంటర్ల ద్వారా టిక్కెట్లు అమ్ముకుని వందల కోట్లు భక్తుల వద్ద నుంచి దోచుకున్నారని తాజాగా బయటడపడుతోంది. విజిలెన్స్ విచారణలో ఇవన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతోనే… తనకు సమాచారం లేదని వైవీ సుబ్బారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అయితే కోర్టుల్ని అడ్డం పెట్టుకుని ఎంతో కాలం తప్పించుకోలేరని.. చేసిన పాపం పండిన సమయం వచ్చిందని భక్తులు మండి పడుతున్నారు.