బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?
– ఈ దశాబ్దపు ప్రశ్నగా మిగిలిపోయింది. రాజమౌళినే కాదు.. బాహుబలి టీమ్‌కి సంబంధించి ఏ ఒక్కరు కనిపించినా మీడియా ఇదే ప్రశ్న సంధిస్తోంది. ”మాకు తెలీదు… రాజమౌళి గారిని అడగండి” అంటూ వాళ్లు తప్పించుకొంటున్నారు. రాజమౌళిని అడిగితే ”పార్ట్ 2 చూడండి.. అప్పటి వరకూ సస్పెన్స్” అంటూ మరింత ఊరిస్తున్నారు. అయితే ఇదే ప్రశ్న.. బాహుబలిని చంపిన కట్టప్ప సత్యారాజ్నే వేస్తే..?
‘దొర’ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆసినిమా ప్రచారంలో బాగంగా సత్యరాజ్ హైదరాబాద్ వచ్చారు. ఈసారి ఆయనకీ ఇదే ప్రశ్న ఎదురైంది. బాహుబని ఎందుకు చంపారు? అని కట్టప్పని అడిగితే ”రాజమౌళి చంపమన్నారు… అందుకే చంపా” అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. అంతేకాదు బాహుబలి 2 విశేషాల్నీ పంచుకొన్నారు.
”కట్టప్ప పాత్ర బాహుబలి లో ఎలా ఉందో.. బాహుబలి 2లో అంతకంటే గొప్పగా ఉంటుంది. త్వరలో షూటింగ్ లో పాల్గొన బోతున్నా” అంటున్నారు సత్యరాజ్. క్యారెక్టర్ నటుడిగా తెలుగులో తన ప్రయాణం హ్యాపీగా ఉందని, మంచి మంచి పాత్రలు వస్తున్నాయని, వాటిని న్యాయం చేయడానికి అహర్నిశలూ కృషి చేస్తానంటున్నాడీ నటుడు.