జగన్ రెడ్డికి కనీస రాజకీయాలు చేసే పొటెన్షియాలిటీ లేదని తేలిపోయింది. చివరికి ఆయన దేశాన్ని, బీజేపీని కూడా నిందిస్తున్నారు. కానీ చుట్టుముట్టిన సమస్యల నుంచి ఎలా బయటపడాలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. చెట్టుకొట్టి మీద వేసుకుని… తనను నమ్ముకున్న అందర్నీ చెట్టుకింద సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ.. బయటకు వచ్చి నిలబడదామనే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
లడ్డూ కల్తీపై అతి స్పందనతో జాతీయ సమస్య
చంద్రబాబు లడ్డూ కల్తీ అంశాన్నిప్రస్తావించినప్పుడు జగన్ హయాంలో ఇలా జరిగింది అని ప్రస్తావించారు. జగన్ చేయించారని చెప్పలేదు. కానీ జగన్ తెరపైకి వచ్చి అసలు తప్పే జరగలేదని వాదించారు. బయటకు వచ్చిన సాక్ష్యాలు ఆయన పెద్ద మోసగాడని ప్రజలు నమ్మేలా చేసింది. జగన్ అతి స్పందనతో..ఈ అంశం నేషనల్ హాట్ టాపిక్ అయింది. జగన్ రెడ్డి హిందూ విశ్వాసాలను దెబ్బకొట్టారని నమ్మడం ప్రారంభించారు.
క్రిస్టియన్‌ను అని అంగీకరించాల్సిన పరిస్థితి
అసలు తిరుమల టూర్ అనే ఆలోచన .. బుద్ది ఉన్న ఏ రాజకీయ నేత పెట్టుకోరు. ఎందుకంటే .. జగన్ రెడ్డి ఎప్పుడు తిరుమల వెళ్లినా డిక్లరేషన్ అంశం తెరపైకి వస్తుంది. ప్రతిపక్ష నేత హోదా కూడాలేని ఇప్పుడు వెళ్తే రాదా ?. తిరుమల టూర్ ప్రకటించగానే..అందరూ ఇదే డిమాండ్ ప్రారంభించారు. చివరికి ఆ రాజకీయంలో జగన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. తాను క్రిస్టియన్‌ను అని అంగీకరించాల్సి వచ్చింది. ఇది చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు.
దేశాన్ని తిట్టి ఏం సాధిస్తారు ?
గుడికి వెళ్తే మతమడుగుతారా అని.. ఆవేశపడిపోయిన ఆయన ఇది ఏం దేశం అని కూడా నిందించారు. జగన్ రెడ్డికి కనీసం దేశం మీద కూడా ఏ మాత్రం అభిమానం లేదని తేలిపోయింది. ఆయన తన కు మద్దతుగా లేరని బీజేపీని కూడా తిడుతున్నారు. ఇక చెప్పాలంటే..అసలు మనస్థత్వం ప్రజల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆయనను ఏ రూపంలో సమర్థించేవారున్నా సిగ్గుపడాల్సిందే. ఎలా చూసినా ఇప్పటి వరకూ జగన్ చుట్టూ కట్టిన ఓ మాయా ఇమేజ్ గోడ కూలిపోయింది.