హైడ్రా బాధితుల పేరుతో చేస్తున్న రాజకీయం పూర్తిగా బీఆర్ఎస్ దగ్గరే కనిపిస్తోంది. నిజానికి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అందరూ ప్రభుత్వ కార్యాలయాల వద్దకు లేదా ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు పెడతారు. లేకపోతే రోడ్డెక్కుతారు. కానీ హైదరాబాద్ లో హైడ్రా బాధితుల పేరుతో జరుగుతున్న రాజకీయంలో కొన్ని యూట్యూబ్ చానళ్ల ముందు…మరికొన్ని బీఆర్ఎస్ ఆఫీసుల ముందే ఎక్కువగా సన్నివేశాలు జరుగుతున్నాయి.
కేటీఆర్ కు తమ బాధలు చెప్పుకుంటామని హైడ్రా బాధితుల పేరుతో కొంత మంది తెలంగాణ భవన్ కు వచ్చారు. కేటీఆర్ తనకు జ్వరం వచ్చిందని చెప్పి రాలేదు. కానీ హరీష్ రావు వచ్చారు. వారి ముందు చాలా మంది తమ బాధలు చెప్పుకున్నారు. మూసిలో మార్క్ చేసిన ఇళ్ల కు చెందిన వారిని కూడా అలా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇలా వచ్చినవాళ్లు అంతా పొలిటికల్ ఎజెండాతోనే మాట్లాడుతున్నట్లుగా ఉంది కానీ తమ సమస్యకు పరిష్కారం వెదుక్కోవాలన్నట్లుగా ఉండటం లేదు.
గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు చెలరేగిపోయారు. అన్ని రకాలుగా కబ్జాలు చేసి అమ్ముకున్నారు. ఇప్పుడు వారందరిపై ఒత్తిడి పెరుగుతోంది. రిజిస్ట్రేషన్లు కూడా చేయించారు కాబట్టి.. .. పరిహారం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలాంటివారందర్నీ బీఆర్ఎస్ నేతలు … హైడ్రా బాధితులుగా కార్యాలయానికి తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పేందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారన్న గుసగుసలు వినిపస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఉద్ధృతంగా హైడ్రా సమస్య ఉంటే.. ఇలా బీఆర్ఎస్ ఆఫీసుల్లోనే రాజకీయం జరగదని.. అదంతా ఆర్గనైజింగ్ గా జరుగుతోందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.