సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ దూరం పెట్టాలని వైసీపీలో 90 శాతం మంది నేతలు బలంగా కోరుకుంటున్నారు. జగన్ చుట్టూ చేిన ఓ కోటరీ ఆయనను హలోకేషన్ లో ఉంచుతోందని నిజాలేమిటో తెలియనివ్వకుండా చేస్తోందని ఆ 90 శాతం కోపం. ఎన్నికల ఫలితాల తర్వాత అయినా ఆయనను జగన్ దూరం పెడతారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో వైసీపీలో అదే అసంతృప్తి కనిపిస్తోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం హమ్మయ్య అనుకుంటున్నారు.
జగన్ రెడ్డిని తన విచిత్రమైన కుట్ర సిద్ధాంతాలు, తప్పుడు రాజకీయ వ్యూహాలతో నిలువునా నాకించేసింది సజ్జల రామకృష్ణారెడ్డేనని టీడీపీకి బాగా తెలుసు. ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేని వాళ్లతో టీడీపీ నేతల్ని తిట్టించడమే రాజకీయం అనుకుంటారు. యాంకర్ శ్యామల, పోసాని లాంటి వాళ్లతో … చంద్రబాబును తిట్టిస్తే వైసీపీకి మేలు జరుగుతుందా …?. పోసాని మాట్లాడే మాటలు వింటే వైసీపీ వాళ్లకూ విరక్తి పుడుతుంది. మాట్లాడితే ముందు మర్డర్ స్కెచ్ అంటారు. పోసాని మాట్లాడిన మాటలకు… కూటమి ప్రభుత్వం వచ్చిన రోజుల్లోనే రఘురామకు వైసీపీ సర్కార్ లో ఇచ్చినట్లుగా బడితెపూజ ట్రీట్ మెంట్ ఇచ్చి ఉండేవారు కాదా.
పోసాని, ఆర్జీవీ సహా ఎంతో మంది కనీస వాల్యూ లేని వాళ్లను సజ్జల ఎంగేజ్ చేసుకుని మొత్తం నాశనం చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. స్క్రిప్టులు కూడా సజ్జల ఆఫీసు నుంచే వెళ్తున్నాయి. ఇక ముందు కూడా ఇలాంటి క్యారెక్టర్లతోనే ప్రభుత్వంపై పోరాటం చేస్తే.. వైసీపీ కోలుకునే చాన్సే ఉండదని టీడీపీ నేతలు కూడా భరోసాగా ఉంటున్నారు. అందుకే సజ్జలపై ఈ మధ్య పెద్దగా విమర్శలు కూడా చేయడం లేదు.