గుడ్డెద్దు చేలో పడినట్లుగా చేసే రాజకీయాలు చేస్తే సింపుల్గా చేద్దామనుకున్నది కూడా చనిగి చేటంతయి చేపంతవుతుందని వైసీపీ అధినేత జగన్ రెడ్డికి బాగానే తెలిసి వచ్చింది. లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో పవన్ ప్రారంభించిన ప్రాయశ్చిత్త పూజలకు కౌంటర్ గా ఆయన చేయాలనుకున్న పూజలు కాస్తా.. ఆయన అచ్చమైన క్రిస్టియన్ గా ప్రజల ముందు నిలబెట్టేలా చేశాయి. తమకు తాము తెచ్చి పెట్టుకున్న డిక్లరేషన్ వివాదంతో … తన గొయ్యిని ఇంక పెద్దది చెసుకున్నారు.
లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించిన అంశంపై నార్త్ లో ఎక్కువ రియాక్షన్ వచ్చింది. ఏపీలో ఆయనకు ఉన్న ఓటు బ్యాంక్ స్వతహాగా ఆయనది కాదు. చంద్రబాబు, పవన్ పై వ్యతిరేకంగా ఉండే వాళ్లు దిక్కులేక ఆయనను సమర్థిస్తున్నారు. ఈ కారణంగా జగన్ విషయంలో వారు మౌనంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే తిరుమల దర్శనానికి వెళ్తానని ప్రకటించి.. డిక్లరేషన్ అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చుకున్నారో అప్పుడే రాష్ట్రంలో ఎఫెక్ట్ కనిపించింది. జగన్ రెడ్డి క్రైస్తవుడు… కనీసం హిందూ ధర్మాన్ని గౌరవించడు అన్న భావన వెళ్లిపోయేలా చేసుకున్నారు.
నా మతం మానవత్వమంటూ జగన్ కవర్ చేసుకునేందుకు చెప్పిన డైలాగ్ కూడా నవ్వుల పాలయింది. జగన్ రెడ్డిలో మానవత్వం ఉందని ఒక్కరు కూడా అంగీకరించలేదు. చివరికి తల్లి, చెల్లి కూడా. ఇంత గుడ్డిగా తన తన గొయ్యి తాను తీసుకునే రాజకీయ నాయకుడు చరిత్రలో ఉండరేమో. ఆయనకంటూ షర్మిల బలమైన ప్రత్యామ్నాయంగా వస్తున్నారు. జగన్ కన్నా ఆమె ఎన్నో రెట్లు తెలివిగల రాజకీయాలు చేస్తారన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు.