పొలిటికల్ సైన్స్ పాఠాల్లో చెప్పినట్లుగా బయట.. నిజమైన రాజకీయాల్లో వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో మాస్టర్ కొలికపపూడి శ్రీనివాసరావుకు మూడు నెలలకే అవగాహనకు వచ్చి ఉంటుంది. చంద్రబాబు టిక్కెట్ ఇస్తే గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన తంటాలు పడుతున్నారు. బెదిరిపులతో రాజకీయం అయిపోతుదంని అనుకున్నారమో కానీ మొదటికే మోసం వచ్చింది.
తిరువూరు నుంచి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు తిరువూరు బాధ్యతలు ఇచ్చింది టీడీపీ నాయకత్వం. ప్రస్తుతానికి ఓ నెల రోజుల పాటు తిరువూరు వ్యవహారాలను చూసుకోవాలని సూచించింది. అప్పట్లో పరిస్థితులు చక్కబెడితే మళ్లీ కొలికపూడికి మెల్లగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ లోపు ఆయన సర్దుబాటు కాకపోతే ప్రత్యామ్నాయం చూసుుకుంటారు. తదుపరి నిర్ణయం నియోజకవర్గం కార్యకర్తలు తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకమాండ్ తెలిపింది.
కొలికపూడి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఎవరితోనూ సత్సంబంధాలు పెట్టుకోవడం లేదు. అందరితోనూ వివాదాలే. చివరికి ఆయనకు అపరిమితమైన కవరేజీ ఇచ్చి ప్రోత్సహించిన ఆంధ్రజ్యోతినీ దూరం చేసుకున్నారు. ఇక అక్కడ ఉన్న కార్యకర్తల విషయంలో చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలంటే ఒకరు నేర్పేవి కాదని ఆయనకు అర్థమవుతుదో లేదో కానీ.. మూడు నెలలకే చేయి దాటిపోయే పరిస్థితిని తెచ్చుకున్నారు.