కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రాజకీయ యాగం చేస్తున్నారు. ఆయన ఇప్పుడల్లా బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ సెలక్టివ్ గా పార్టీ నేతల్ని కలుపుస్తున్నారు. అపాయింట్మెంట్లు అడిగిన వారిలో కింది స్థాయి కార్యకర్తల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ విషయాలేమీ బయట పెద్దగా ప్రచారం జరగకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గ్రౌండ్ లెవల్ పార్టీ గురించి ఆరా తీస్తున్నారు తీసుకోవాల్సిన చర్యలపై స్కెచ్ లు రూపొందిస్తున్నారు.
కేసీఆర్ అపరచాణక్యుడు. ఆయన వ్యూహాలన్నీ గెలిచినప్పుడు అద్భుతంగా పని చేశాయి. కానీ ఓటమి బాటలో ఉన్నప్పుడు మరింత నష్టాన్ని చేశాయి. ప్రస్తుత పార్టీ పరిస్థితికి కేసీఆరే బాధ్యుడు. ఆ బాధ్యత తీసుకోవడానికి కేసీఆర్ కూడా రెడీగా ఉన్నారు. అందుకే ఫామ్‌హౌస్‌లో కూర్చుని కరెక్షన్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆవేశపడి రోడ్ల మీదకు వస్తే జరిగేదేమీ ఉండదని ఆయనకూ అర్థమయింది. కాంగ్రెస్ పార్టీ పాలన ఏమిటో ప్రజలు అర్థం చేసుకునేలా చేసి అప్పుడు రోడ్ల మీదకు వస్తే ఎఫెక్ట్ ఉంటుందని ఆశిస్తున్నారు.
కేసీఆర్ ఇప్పుడు పార్టీకి మళ్లి పూర్వ వైభవం తేవడాన్నే టార్గెట్ గా పెట్టుకుంది. ఇందు కోసం క్షేత్రస్థాయిలో ఏం చేయాలో కూడా సూచనలు చేస్తున్నారు. తాను ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత సునామీ వచ్చేలా చేయాలనుకుంటున్నారు. దానికి అసరమైన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అందుకే .. ప్రభుత్వంపై అసంతృప్తి పెంచి వచ్చే ఏడాది మాత్రమే ఆయన ప్రజల మధ్యకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.