కర్ణాటకలో ఏం జరిగినా అన్నీ విచిత్రంగానే ఉంటూంటాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి కుమారస్వామి, ఏడీజీపీ హోదాలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఇద్దరూ అదే పనిగా తిట్టుకుంటున్నారు. కర్ణాటకలో లోకాయుక్తకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ప్రత్యేకంగా పోలీసులు కూడా ఉంటారు. లోకాయుక్తకు ఏడీజీగా మువ్వ చంద్రశేఖర్ అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నారు. ఆయన ఏపీకి చెందిన వారే కానీ.. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్. కానీ పాతికేళ్లుగా కర్ణాటకలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు చేసిన కొన్ని భూమల డీ నోటిఫికేషన్ కేసుపై విచారణ జరుపుతున్నారు.
ముడా వ్యవహారంలో సిద్ధరామయ్యపై లోకాయుక్తలో కేసు నమోదు అయింది . ఈ తరుణం కుమారస్వామిని విచారణకు పిలిపించి ప్రశ్నించారు . లోపం ఏం ఇబ్బంది ఎదురయిందో కానీ విచారణ నుంచి ఇంటికెళ్లిపోయి విచారణాధికారిపై ఆరోపణలు గుప్పించారు. ఆయన కర్ణాటకలో ఎలా పని చేస్తున్నారని.. హిమచల్ క్యాడర్ అని. ఏపీ అని ప్రశ్నించారు. అంతేనా భారీ అవినీతిపరుడని ముఫ్పై అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ కూడా కడుతున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై ఐపీఎస్ అధికారికి చంద్రశేఖర్ కూడా స్పందించారు. పందితో కుస్తీ చేస్తే బురద మనకు అంటుకుంటుందని అలాంటి పనులు చేయబోనన్నారు. కుమారస్వామి బెయిల్ పై ఉన్న నేరస్తుడన్నారు. ఈ మాటలు సంచలనం సృష్టించాయి. కుమారస్వామి బీజేపీ కూటమిలో ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన నేరుగా అమిత్ షాకు ఫోన్ చేశారు. కేంద్రం కూడా సీరియస్ గా స్పందించింది. కానీ చంద్రశేఖర్ కు కాంగ్రెస్ ప్రభుత్వంలో పలుబడి ఉంది. డిప్యూటీ సీఎం శివకుమార్ ఆయనకు మద్దతుగా ఉన్నారు.