అపార్టుమెంట్లో ఉండే జైల్లో ఉన్నట్లుగా ఫీలయ్యేవారు ఎందరో. కానీ మరో చాయిస్ ఉండదు. ఇప్పుడు తరం మారుతోంది. అభిరుచులు మారుతున్నాయి. చాలా మంది కాస్త దూరం వెళ్లినా సరే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలని ఆశ పడుతున్నారు. ఇలాంటి వారికి పటాన్ చెరు వైపు చక్కని చిరుమానా ఇంద్రేశం.
పటాన్ చెరులో కాస్త కలిసినట్లుగా ఉండే ఇంద్రేశం..ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఉంటుంది. కిష్టారెడ్డి పేటలోనూ ఇళ్లు కాస్ట్లీగా మారడంతో ఎక్కువ మంది ఇంద్రేశం వైపు చూస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న బిల్డర్లు, మేస్త్రీలు పెద్ద ఎత్తున ఇళ్లు కడుతున్నారు. విల్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. మేస్త్రీలు కట్టిన విల్లాలు కోటిన్నర వరకూ ఉన్నాయి. అదే కాలనీల్లో అయితే 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెట్టుకుంటే మంచి ఇల్లు వస్తోంది. అందుకే ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంద్రేశం వైపు చూస్తున్నారు.
ఇప్పుడిప్పుడే బడా కంపెనీల చూపు కూడా ఇంద్రేశం వైపు పడుతోంది. ఇంద్రేశంకు కాస్త దూరంగా ఔరో రియాలిటీ సంస్థ భారీ ప్రాజెక్టు చేపట్టింది. అన్నీ విల్లాలే. బుకింగులు జోరుగా సాగడంతో నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ కారణంగా ఇతర సంస్థలు కూడా ఇంద్రేశం వైపు చూస్తున్నాయి. హైటెక్ సిటీకి దగ్గరగా ఉండాలి.. పరిమితమైన బడ్జెట్.. ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునేవారికి చక్కని చిరునామా ఇంద్రేశం.