వైవిధ్య కథలు, పాత్రలతో అలరిస్తున్నారు శ్రీవిష్ణు. ‘రాజ రాజ చోర’తో తొలి ప్రయత్నంలోనే మెప్పించారు దర్శకుడు హసిత్ గోలి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తాజాగా ట్రైలర్ ని వదిలారు.
ఇదొక ‘వంశ వృక్షం’ కథ. శ్వాగనిక వంశంలోని మగవాడి చరిత్ర. 1551సంవత్సరం నుంచి మగావాడి ప్రయాణం అంటూ ట్రైలర్ మొదలుపెట్టారు. బిగినింగ్ ఎపిసోడ్ లో ‘శ్వాగ్’ టైటిల్ గురించి విష్ణు క్యారెక్టర్ ఇచ్చిన జస్టిఫికేషన్ నవ్వించింది. ఇందులో నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపించాడు శ్రీవిష్ణు. ఒకొక్క గెటప్ ఒకొక్క తరం. ఈ కథలో ఆడ-మగ డామినెన్స్ కీ ఎలిమెంట్. అలాగే లింగ వివక్ష కోణాన్ని కూడా టచ్ చేశారు.
ఓ వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథలు కీలకంగా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. డైరెక్టర్ హసిత్ కొంచెం వైవిధ్యంగానే కథని ప్రజెంట్ చేశాడు. ఇన్ని గెటప్స్ లో కనిపించడం శ్రీవిష్ణుకి ఇదే తొలిసారి. రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నగర్కర్ పాత్రలు కూడా కీలకంగా వున్నాయి. మొత్తనికి ఒక సీరియస్ టాపిక్ ని వినోదాత్మకంగా ప్రజెంట్ చేసింది ఈ ట్రైలర్. అక్టోబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.