దర్శకుడు వి.ఎన్.ఆదత్య పేరు ఈమధ్య మీడియాలో తెగ వినిపిస్తోంది. ఈ దర్శకుడు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఫ్యామిలీని వదిలేసి అమెరికా వెళ్లిపోయాడని ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఆదిత్య స్పందిస్తూ మీడియాకు ఓ లేఖ రాశారు. తాను అమెరికా పారిపోలేదని.. అమెరికాలో తెలుగు సినిమాకి సంబంధించిన అధ్యయనంచేస్తున్నానని, అది తెలుగు సినిమా తీయడం కంటే గొప్పని చెప్పుకొచ్చారు. కుటుంబాన్ని వదిలేశానన్న వార్తల్లోనూ నిజం లేదని, తన ఫ్యామిలీకి ఎప్పుడూ టచ్లో ఉంటున్నానని పేర్కొన్నారు ఆదిత్య.
తానెప్పుడూ అవకాశాల కోసం వెంపర్లాడలేదని, మనసుకు నచ్చినప్పుడే సినిమా తీస్తానని పేర్కొన్నారాయన. నిజానిజాల్ని వెలికి తీయడం మీడియా ధర్మమని, అయితే ఓ వార్త రాసేటప్పుడు తనని సంప్రదించడం మర్యాదని, తెలిసీ తెలియక ఏవేవో వార్తలు రాస్తే తానేం బాధ పడకపోయినా, తన కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదనకు గురవుతున్నారి, అందుకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొన్నానన్నారాయన. ఆంగ్ల పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సైతం సిద్ధమని హెచ్చరించారు. ఇకనైనా తనపై వార్తలు రాసేముందు ఒకసారి తనని సంప్రదిస్తే మంచిదని మీడియాని కోరుతున్నారు ఆదిత్య. ఇకనైనా ఈ వివాదానికి, ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.