పవన్ కల్యాణ్ అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్లారు. ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్లే వారికి తెలుసు ఎంత కష్టమో. మెట్ల మార్గం ద్వారా వెళ్తే రెండు గంటల్లో వెళ్లిపోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ అలిపిరి మార్గాన్నే ఎంచుకున్నారు. మంచి వయసులో ఉన్నవారికి కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. పవన్ కల్యాణ్ ఎంత కష్టమైన తగ్గకుండా నడుచుకుంటూ వెళ్తారు. దేవుడికి లడ్డూ కల్తీ విషయంలో జరిగిన అపచారానికి భక్తుడికి తన వంతు ప్రాయశ్చిత్తం చేశారు. అయితే దీన్ని కొంత మంది వైసీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. ఓ వ్యక్తి కష్టం చూసి ఎవరూ ట్రోల్ చేయరు… అలా చేస్తే సైకోలే అవుతారు.
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కోసం తన వాయిస్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎన్ని కష్టాలు ఎదరైనా తగ్గేది లేదని తన నడక యాత్రద్వారా నిరూపించారని అనుకోవచ్చు. గతంలోనూ పవన్ ఇలా తిరుమలకు నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మరింత వయసు పెరిగినా వెనక్కి తగ్గలేదు. పవన్ ను ట్రోల్ చేసేవారు తమ లీడర్ ఇలా నడవగలడో లేదో అంచనా వేసుకోవాలన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. గట్టిగా ఓ పది నిమిషాలు నిలబడి వినతి పత్రాలు తీసుకోలేరని అనేక సార్లు వెల్లడయింది.
తిరుమలకు కాలి నడకన వస్తానని ప్రచారం చేసుకుని దేవుడ్ని వాడుకోవడం తప్ప..ఇప్పటి వరకూ ఎప్పుడూ పవన్ ను విమర్శించే వ్యక్తుల అభిమాన నాయకుడు తిరుమలకు నడుచుకుంటూ రాలేదు. కానీ అబద్దాలు మాత్రం చెబుతారు. నడుచుకుంటూ వచ్చానని ఆయన ఓ సారి చెప్పుకున్నారు. కానీ అది అబద్దం. కానీ అలా నడుకుకుంటూ వెళ్తే పట్టే చెమటలను మాత్రం అపహాస్యం చేసేవారు ఉన్నారు. ఎవరెన్ని అన్నా పవన్ ..ధర్మ పోరాటానికి మరింత బలమే వస్తుందని జనసైనికులు అంటున్నారు.