తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలపై హీరో నాగార్జున తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించారు. ”రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు నాగార్జున.
https://x.com/iamnagarjuna/status/1841446247242035233?t=tLwO-kGsdtDMkY1aFIDxgQ&s=19
మంత్రి కొండా సురేఖ, బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై కొన్ని ఆరోపణలు చేస్తూ నాగచైతన్య, సమంత విడాకులు ప్రస్తావన తీసుకొచ్చారు. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండ ఉండాలంటే సమంత తన దగ్గర రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడని, నాగార్జున, నాగ చైతన్య మాట్లాడి సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారని, కేటీఆర్ దగ్గరికి వెళ్ళడానికి సమంత ఒప్పుకోలేదని, కేటీఆర్ దగ్గరకి వెళ్ళకుంటే నివ్వు మాకు వద్దన్నారని, అది బరించలేకనే సమంత విడాకులు తీసుకుందని ఓ సంచలన ఆరోపణ చేశారు కొండా సురేఖ.
ఆమె ఎలాంటి ఆధారాలతో ఈ ఆరోపణ చేశారో గానీ నాగార్జున కుటుంబ వ్యక్తిత్వం హననం చేసేలా ఈ ఆరోపణలు వున్నాయి. దీంతో వెంటనే నాగార్జున తీవ్రంగా స్పందించారు. మరి కొండా సురేఖ తన వాఖ్యాలని వెనక్కి తీసుకుంటారా? లేదా నిజంగానే ఆమె ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా ? అనేదే ఆమెనే చెప్పాలి.