జగన్ రెడ్డిని నమ్ముకుని నట్టేట మునిగిపోయిన అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ ఒకరు. ఆయన ఏడేళ్ల ముందే వీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాతి రోజే కోర్టు ఆయనకు నెల రోజుల జైలు శిక్ష విధించింది. కోర్టుతీర్పును పట్టించుకోకుండా తాము జగన్ రెడ్డి రాజ్యాంగంలో భాగమని నమ్మడం ద్వారా ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు అంటే ప్రతీ దానికి కోర్టులకు పరుగెడుతున్నారు కానీ.. జగన్ రెడ్డిహయాంలో కోర్టు ఆదేశాలను లెక్కచేసేవారు కాదు. కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేలల్లో పడినా అంతే .,
కోర్టు ఆదేశించినా అమలు చేయాల్సిన అవసరమే లేదని కనీసం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది జగన్ ప్రభుత్వ పాలసీ.దీన్ని ప్రవీణ్ ప్రకాష్ పక్కాగా అమలు చేశారు. చివరికి ఆయనకు ఓ ధిక్కారం కేసులో నెల రోజుల జైలు శిక్షపడింది. వైసీపీ హయాంలోఇలా జైలు శిక్ష పడిన సివిల్ సర్వీస్ అధికారుల సంఖ్యకు లెక్కేలేదు. వెంటనే డివిజన్ బెంచ్ కు వెళ్లి ఎలాగోలా శిక్షను ఆపుకున్నారు కానీ.. తమ సర్వీసు రికార్డుల్లో అది ఉంటుందన్న సంగతిని మాత్రం మర్చిపోతున్నారు.
ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ తో పాటు శేషగిరి అని మరో అధికారికి కూడా శిక్ష విధించింది. ఇప్పుడు వారికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం లభించడం కష్టం. ఎదుకంటే గత ప్రభుత్వ నిర్వాకాన్ని తమ పై వేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధపడదు. అందుకే వారి అప్పీల్ ప్రయత్నాలు ఫలిస్తాయా లేకపోతే జైలు శిక్ష అనుభవిస్తారా అన్నది సస్పెన్సే. జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ప్రవీణ్ ప్రకాష్ చేసిన నిర్వాకాలకు సరైన శిక్షపడినట్లేనని సంతోషపడే ఆయన బాధితులు చాలా మంది ఉన్నారు.