వైసీపీకి చేసే సిల్లీ కుట్రలకు సిద్ధాంతకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. అడ్డంగా దొరికిపోయే ఇలాంటి వేషాలను ఒకటి మీడియా ముందే ప్రదర్శించారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. లడ్డూ నెయ్యిలో కల్తీ లేదని తనదైన సిద్ధాంతాలను వర్ణించేందుకు నాలుగు రోజుల కిందట సజ్జల ఓ ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని సాక్షి మీడియా తప్ప ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ ప్రెస్ మీట్లో ఆయనో మ్యాజిక్ చేశారు. అదేమిటంటే శిలువల్ని మాయం చేయడం.
సజ్జల ప్రెస్‌మీట్ పెట్టిన ఆఫీసులో ఆయన కూర్చున్న కుర్చీ నుంచి కెమెరా పెట్టిన ఫ్రేమ్‌లో వెనుక నాలుగు శిలువ బొమ్మలు ఉన్నాయి. సజ్జల మాట్లాడటం ప్రారంభిచిన తర్వాత అవి ప్రముఖంగా కనిపించడం ప్రారంభించాయి. దీంతో ఓ ప్లాన్ వేశారు. ఆయన తాను చదువుతున్నట్లుగా పేపర్ ను కెమెరాకు చూపిస్తే… ఆ కెమెరామెన్ పేపర్ దగ్గరకు ఫ్రేమ్ జూమ్ ఇన్ చేశాడు. కాసేపటి తర్వాత జూమ్ అవుట్ చేశాడు. ఈ మధ్యలో ఫ్రేమ్ నుంచి శిలువల్ని తీసేశారన్నమాట.
అది మీడియా సమావేశం కాదు. సాక్షి కెమెరా మాత్రమే పెట్టిన లైవ్. అందుకే అలా దొరికిపోయారు. మాములుగా ఆయన చెప్పేదందా సోది అని ఇతర మీడియా చానళ్లు పట్టించుకోలేదు. ఆ విషయం తర్వాత బయటడపడింది. ఆ శిలువల్ని తీసేసి మరింతగా నవ్వుల పాలయ్యారు. సజ్జలచేసే పనులన్నీఇలాగే ఉంటాయని వైసీపీలో కూడా సెటైర్లు వేసుకుంటున్నారు.