ఈమధ్య హీరోలు రూటు మార్చారు. పారితోషికాలకు బదులు.. లాభాల్లో వాటాలు తీసుకొంటున్నారు. కొంతమందైతే అటు పారితోషికం, ఇటు వాటా అంటూ రెండు వైపులా లాభపడుతున్నారు. ఎన్టీఆర్ కూడా అంతేనట. జనతా గ్యారేజీ కోసం ఎన్టీఆర్ పారితోషకం, లాభాల్లో వాటా రెండూ తీసుకొన్నాడని టాక్. టెంపర్, నాన్నకుప్రేమతో సినిమాలో మళ్లీ రేసులోకి వచ్చాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజీ ప్రాజెక్టును సెట్ చేసుకొంది కూడా ఎన్టీఆరే. `ముందు ఈ సినిమా బాగా తీద్దాం.. అప్పుడు నా పారితోషికం కోసం ఆలోచిద్దాం` అని నిర్మాతలకు చెప్పేశాడు ఎన్టీఆర్. ఓ హీరో ఇలా అంటే అంతకంటే కావల్సింది ఏముంది? అందుకే ఎన్టీఆర్కి కొంతమొత్తం పారితోషికం ఇచ్చి రంగంలోకి దిగింది మైత్రీ మూవీస్.
ఇప్పుడు ఈ సినిమాకి మంచి రేటు వచ్చింది. సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ చూశారు నిర్మాతలు. అందుకే… ఇప్పుడు లాభాల్లోనూ ఎన్టీఆర్కి వాటా దక్కిందని టాక్. అటు పారితోషికం, ఇటు లాభాలూ రెండూ కలిపి దాదాపుగా రూ.18 కోట్ల వరకూ ముట్టాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ అందుకొన్న అత్యధిక పారితోషికం ఇదే. మొత్తానికి ఎన్టీఆర్ వేసిన స్కెచ్ అద్భుతంగా పారింది. ఇక ముందు కూడా ఎన్టీఆర్ ఇదే బాటలో పయనిస్తాడేమో చూడాలి.