హీరో నాగార్జున, మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టు ని ఆశ్రయించారు. మొత్తం ఆధారాలతో సహా తొమ్మిది పేజీల కంప్లయిట్ డాక్యుమెంట్ ని సమర్పించారు.
“నాగ చైతన్య డివోర్స్ 100% కే.టి.ర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే ఎన్-కన్వెన్షన్ హాల్ ను కూలగొట్టద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలే అని చెప్పి ఆయన డిమాండ్ చేసాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేసారు. సమంత నేను వెళ్ళను అనింది. వెల్లను అంటే చెపితే వింటే విను లేకపోతే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు.”
కొండా సురేఖ చేసిన ఈ కామెంట్స్ ని ఒరిజినల్ స్టేట్మెంట్ గా ఒక్క అక్షరం పొల్లుపోకుండా కంప్లయింట్ లో జత చేశారు.
మరోవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఒక మహిళా మంత్రిగా ఉండి, మరో మహిళ పేరు ప్రస్తావించడం, రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరైనది కాదంటూ అందరూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నారు.